Kiran Abbavaram : పవన్ దెబ్బకి వెనక్కి తగ్గిన మరో యువ హీరో

గతంలోనే పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాని ఫిబ్రవరి 25న ప్రకటిస్తామని అనౌన్స్ చేశారు. అయితే పవన్ ఫ్యాన్ అని చెప్పుకునే కిరణ్ తన సినిమాని పవన్ ప్రకటించిన డేట్ రోజు రిలీజ్.........

Kiran Abbavaram :  పవన్ దెబ్బకి వెనక్కి తగ్గిన మరో యువ హీరో

Pawan

Updated On : February 20, 2022 / 5:40 PM IST

Pawan Kalyan :   ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమై, ‘SR కల్యాణ మండపం’తో మెప్పించి ఇండస్ట్రీలో అందరితో మంచి సర్కిల్ మెయింటైన్ చేస్తూ వరుస సినిమా అవకాశాలని చేజిక్కించుకుంటున్నాడు యువ హీరో కిరణ్ అబ్బవరం. ఇప్పటికే ఈ యువ హీరో చేతిలో దాదాపు అయిదు సినిమాలు ఉన్నాయి. తాజాగా తన తర్వాతి సినిమా ‘సెబాస్టియన్ PC 524’ ని ఇటీవలే ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

గతంలోనే పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాని ఫిబ్రవరి 25న ప్రకటిస్తామని అనౌన్స్ చేశారు. అయితే పవన్ ఫ్యాన్ అని చెప్పుకునే కిరణ్ తన సినిమాని పవన్ ప్రకటించిన డేట్ రోజు రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో పవన్ అభిమానులు కిరణ్ ని ట్రోల్ చేశారు. పవన్ ఫ్యాన్ అని చెప్పుకొని పవన కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రోజు నీ సినిమాని ఎలా రిలీజ్ చేస్తావు అంటూ కొంతమంది పవన్ అభిమానులు కిరణ్ ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వాటికి ‘నా సినిమా రిలీజ్ అయినా అన్న సినిమాకే వెళ్తాను’ అని ఏదో సమాధానమిచ్చి పవన్ ఫ్యాన్స్ ని శాంతపరచడానికి ట్రై చేశాడు. కానీ తాజాగా పవన్ సినిమాకి, పవన్ అభిమానుల కామెంట్స్ కి వెనక్కి తగ్గి తన సినిమా రిలీజ్ డేట్ ని మార్చుకున్నాడు ఈ యువ హీరో.

Shruthi Haasan : నేను సాయి పల్లవిలా ఉండను.. అందుకే ఆమెలా నటించలేదు..

తాజాగా కిరణ్ అబ్బవరం తన ‘సెబాస్టియన్ PC 524’ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశాడు. పవన్ సినిమా ఉంటే తన సినిమాకి జనాలు, కలెక్షన్స్ రావని అర్ధం చేసుకొని ‘సెబాస్టియన్ PC 524’ సినిమాని వారం రోజుల పాటు వాయిదా వేశాడు. కిరణ్ తన ‘సెబాస్టియన్ PC 524’ సినిమాని మార్చ్ 4న రిలీజ్ చేయబోతున్నట్టు కొత్త తేదీని ప్రకటించాడు.