Thimmarajupalli tv OTT: ఓటీటీలోకి రూరల్ కామెడీ డ్రామా.. ‘తిమ్మరాజుపల్లి TV’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యంగ్ హీరో కిరణ్ సబ్బవరం నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ(Thimmarajupalli tv OTT)’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతోంది.
thimmarajupalli tv movie ready to streaming on aha
- కిరణ్ అబ్బవరం నిర్మించిన పల్లెటూరి కథ.
- బాల్యపు జ్ఞాపకాలతో తిమ్మరాజుపల్లి టీవీ
- మే 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్.
Thimmarajupalli tv OTT: టాలీవుడ్ యంగ్ హీరో హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా చేసిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ(Thimmarajupalli tv OTT)’. సాయితేజ్, వేద జలంధర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ తమ చిన్ననాటి తీపి జ్ఞాపకాలలోకి తీసుకువెళ్లి, మంచి ప్రశంసలను అందుకుంది.
Janhvi Kapoor: స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్న జాన్వీ కపూర్.. క్రేజీ ఫొటోలు వైరల్
ఇప్పుడు ఈ హృద్యమైన కావ్యం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ వేదికగా మే 15వ తేదీ నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఆహా యాజమాన్యం అధికారికంగా ఒక పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకులకు ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉన్న ఈ కథ, ఓటీటీలోనూ మంచి స్పందన పొందుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
దర్శకుడు వి.మునిరాజ్ సరికొత్త నటీనటులతో ఈ చిత్రాన్ని ఎంతో సహజంగా తెరకెక్కించారు. మారుమూల గ్రామంలోని పరిస్థితులు, అక్కడి ప్రజల భావోద్వేగాలను ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. కిరణ్ అబ్బవరం తన సొంత నిర్మాణంలో ఇలాంటి వైవిధ్యమైన ప్రయత్నం చేయడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి వినోదాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు.
