Vinaro Bhagyamu Vishnu Katha: వినరో భాగ్యము విష్ణు కథ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Vinaro Bhagyamu Vishnu Katha: వినరో భాగ్యము విష్ణు కథ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతో తెలుసా..?

Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha Censor And Runtime

Updated On : February 11, 2023 / 6:18 PM IST

Vinaro Bhagyamu Vishnu Katha: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Vinaro Bhagyamu Vishnu Katha: వినరో భాగ్యము విష్ణు కథ ఆడియో లాంఛ్ ఇక్కడే..!

కాగా, తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధిస్తుందని సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించినట్లుగా చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఇక సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 18 నిమిషాలుగా లాక్ చేసింది చిత్ర యూనిట్. ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీకి ఇది మంచి క్రిస్పీ రన్‌టైమ్ అని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

Vinaro Bhagyamu Vishnu Katha Trailer : ఫోన్ నెంబర్ నైబర్ అంటూ కొత్త కాన్సెప్ట్‌తో ‘వినరో భాగ్యం విష్ణు కథ’.. ట్రైలర్ అదుర్స్!

ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన అందాల భామ కశ్మీర పరదేశి హీరోయిన్‌గా నటిస్తోండగా, మురళీ శర్మ, ఆమని, దేవిప్రసాద్, ప్రవీణ్, ఎల్బీ శ్రీరామ్, శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, డానియెల్ విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. కాగా, ఈ సినిమాను ఫిబ్రవరి 17 రిలీజ్ చేయాలని అనుకున్నా, తాజాగా ఈ సినిమాను మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫబ్రవరి 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.