Game changer : గేమ్ ఛేంజర్ నుంచి ‘కొండ దేవర’ పాట వచ్చేసింది.. విన్నారా?
తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి కొండ దేవర పాటను విడుదల చేశారు.

Konda Devara Song from Ram Charan Game changer movie out now
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా మరో రెండు రోజుల్లో (జనవరి 10న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కొండ దేవర పాటను విడుదల చేశారు.
“నెత్తురంతా ఉడుకుతున్న ఊరువాడ జాతర” అంటూ ఈ పాట సాగుతోంది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, తమన్, శ్రావణ భార్గవి పాడారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
SHARWA-37 : ‘శర్వా 37’ కోసం నందమూరి, కొణిదెల హీరోలు.. టైటిల్, ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్..
ఈ చిత్రంలో కియారా అద్వాని కథానాయిక. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్ జే సూర్య, అంజలి, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఈ చిత్రంలో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అదిరిపోతుందని చిత్ర బృందం చెబుతోంది. అప్పన్న పాత్రలో చరణ్ అదరగొట్టేశాడని అంటున్నారు. ఈ చిత్రంలోని పాటలకే రూ.75 కోట్లకు పైగా ఖర్చు చేశారని నిర్మాత దిల్ రాజు ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే.
Yash birthday : యశ్ పుట్టిన రోజు.. ‘టాక్సిక్’ బర్త్‌డే పీక్ వీడియో వచ్చేసింది.. గూస్‌బంప్స్..