కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ సాంగ్ విన్నారా!

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిస్ ఇండియా’ నుండి ‘కొత్తగా కొత్తగా’ లిరికల్ సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : February 7, 2020 / 11:18 AM IST
కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ సాంగ్ విన్నారా!

Updated On : February 7, 2020 / 11:18 AM IST

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిస్ ఇండియా’ నుండి ‘కొత్తగా కొత్తగా’ లిరికల్ సాంగ్ రిలీజ్..

‘మహానటి’ చిత్రంతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్.. ప్రస్తుతం ‘మిస్ ఇండియా’ అనే మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమా చేస్తుంది. నవీన్ చంద్ర, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, నరేష్, భానుశ్రీ మెహ్రా (వరుడు) ఫేమ్ కీలక పాత్రధారులు.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా నరేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల విడుదల విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. తాజాగా ‘కొత్తగా కొత్తగా’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. థమన్ ట్యూన్ కంపోజ్ చేయగా, కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ రాశారు. మెలోడి క్వీన్ శ్రేయా ఘోషల్ అద్భుతంగా పాడారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి 6న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కమల్ కామరాజు, నదియా, పూజిత పొన్నాడ తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి రచన : నరంద్రనాధ్, తరుణ్, మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రఫీ : డానీ సాంచేజ్- లోపెజ్, వంశీ.పి, ఎడిటింగ్ : తమ్మిరాజు, ఆర్ట్ : సాహి సురేష్.