Krishnam Raju : 70 వేలమందికి భోజనం పెట్టనున్న ప్రభాస్.. మొగల్తూరులో భారీగా కృష్ణంరాజు స్మారక సభ..

సెప్టెంబర్ 29న ప్రభాస్ భీమవరానికి వెళ్లనున్నాడు. అక్కడి నుంచి మొగల్తూరు వెళ్లి కృష్ణంరాజు స్మారక సభలో పాల్గొననున్నాడు. అయితే ఈ సభకి మొగల్తూరు, చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా జనాలు తరలి వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టే ఏర్పాట్లు...............

Krishnam Raju : 70 వేలమందికి భోజనం పెట్టనున్న ప్రభాస్.. మొగల్తూరులో భారీగా కృష్ణంరాజు స్మారక సభ..

Krishnam Raju Family will Arranging food to 70,000 members in mogalthuru

Updated On : September 20, 2022 / 12:08 PM IST

Krishnam Raju : నటుడు, మాజీ కేంద్రమంత్రి, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మరణం అయన కుటుంబానికి, టాలీవుడ్ కి తీరని లోటు. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పించారు. ఇటీవలే హైదరాబాద్ లో కృష్ణంరాజు సంస్మరణ సభ నిర్వహించారు. త్వరలో కృష్ణంరాజు సొంతూరు అయిన మొగల్తూరులో స్మారక సభ నిర్వహించనున్నారు.

ప్రభాస్, అతని ఫ్యామిలీ ఇచ్చే ఆతిథ్యం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది స్టార్లు, అభిమానులు, వాళ్ళ ఇంటికి వెళ్లిన వాళ్ళు చెప్తూ ఉంటారు వారి అతిథ్యం గురించి. సరదాగా ప్రభాస్ భోజనం పెట్టి మరీ చంపేస్తాడు అని కూడా అంటారు. బాలీవుడ్ స్టార్లు అయితే ప్రభాస్ ఫుడ్ కి ఫిదా అయిపోతారు. అతిథులకు భోజనం పెట్టడంలో వారికి ఎవరూ సాటి రారు. ఇటీవల కృష్ణంరాజు మరణించినప్పుడు కూడా, అంత బాధలో కూడా, ఆయన్ని చూడటానికి వచ్చిన అభిమానులకి భోజనం పెట్టి పంపించారు.

Rajamouli : ఆస్కార్ వచ్చినా రాకపోయినా నా సినిమా తీసే విధానం మారదు

సెప్టెంబర్ 29న ప్రభాస్ భీమవరానికి వెళ్లనున్నాడు. అక్కడి నుంచి మొగల్తూరు వెళ్లి కృష్ణంరాజు స్మారక సభలో పాల్గొననున్నాడు. అయితే ఈ సభకి మొగల్తూరు, చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా జనాలు తరలి వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేస్తున్నారు కృష్ణంరాజు ఫ్యామిలీ. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు సంస్మరణ సభకి వచ్చే వారందరికీ భోజనం పెట్టి పంపించాలని ఫిక్స్ అయ్యారు. ఇందుకోసం దాదాపు 70 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి లోకల్ లో ఉండే వ్యక్తులు ఈ విషయాన్ని మీడియాకి తెలిపారు. దాదాపు 70 వేల మందికి భోజన ఏర్పాట్లు చేయనున్నట్టు, స్మారక సభ ఏర్పాట్లు కూడా గ్రాండ్ గా చేయనున్నట్టు తెలిపారు. దీంతో మరోసారి ప్రభాస్, కృష్ణంరాజులని, వారి ఫ్యామిలీలని అంతా పొగుడుతున్నారు.