Uppena : బాలీవుడ్ లోకి ‘ఉప్పెన’.. జాన్వీ కపూర్ చెల్లితో..?

సౌత్ లో హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాలు రీమేక్ అయ్యాయి. ఇప్పుడు ఉప్పెన కూడా రీమేక్ కాబోతుందని సమాచారం.

Uppena : బాలీవుడ్ లోకి ‘ఉప్పెన’.. జాన్వీ కపూర్ చెల్లితో..?

Kristhi Shetty Uppena Movie will Remake in Bollywood with Kushi Kapoor New Goes Viral

Updated On : March 22, 2024 / 11:43 AM IST

Uppena : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), హీరోయిన్ కృతిశెట్టి(Krithi Shetty) జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన సినిమా ఉప్పెన. కరోనా తర్వాత హీరో, హీరోయిన్, డైరెక్టర్ అందరూ కొత్తవాళ్లతో ఓ ప్రేమకథతో ఈ సినిమా వస్తున్నప్పుడు ఎవ్వరికి అంచనాలు లేవు. కానీ థియేటర్స్ ఉప్పెన సినిమా మ్యాజిక్ చేసింది. యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది.

కరోనా సమయంలో రిలీజయి భారీ విజయం సాధించడంతో ఉప్పెన సినిమాను చూసి ఇండస్ట్రీ పెద్దలు సైతం ఆశ్చర్యపోయారు. ఆ సినిమాతో అందులో వర్క్ చేసిన కొత్తవాళ్లంతా బిజీ అయిపోయారు. ఇటీవల మన సౌత్ లో హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాలు రీమేక్ అయ్యాయి. ఇప్పుడు ఉప్పెన కూడా రీమేక్ కాబోతుందని సమాచారం.

Also Read : NTR : ‘దేవర’ నుంచి షూటింగ్ పిక్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్.. ఎన్టీఆర్ లుక్ అదిరిందిగా..

తాజాగా రామ్ చరణ్ RC16 సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి జాన్వీ కపూర్ తో బోనీ కపూర్ కూడా వచ్చారు. ఈవెంట్లో అక్కడ ఉన్నవారితో బోనీ కపూర్ మాట్లాడుతూ.. ఆల్రెడీ బుచ్చిబాబు సాన ఉప్పెన సినిమా చూసాను. నాకు చాలా నచ్చింది. ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. నా చిన్న కూతురు ఖుషి కపూర్ ని ఉప్పెన సినిమా చూడమని చెప్పాను అని అన్నారట.

దీంతో ఉప్పెన సినిమా బాలీవుడ్ రీమేక్ పక్కా ఉంటుందని తెలుస్తుంది. బోనీ కపూర్ నిర్మాణంలో ఖుషి కపూర్ హీరోయిన్ గా ఉప్పెన రీమేక్ ఉండొచ్చని సమాచారం. మరి ఇందులో హీరో ఎవర్ని తీసుకుంటారో. తెలుగులో హిట్ అయినట్టు బాలీవుడ్ లో కూడా ఆ రేంజ్ హిట్ అవుతుందా చూడాలి.