NTR : ‘దేవర’ నుంచి షూటింగ్ పిక్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్.. ఎన్టీఆర్ లుక్ అదిరిందిగా..

తాజాగా దేవర మూవీ యూనిట్ అధికారికంగా షూట్ లొకేషన్ నుంచి ఓ ఫోటో రిలీజ్ చేసారు.

NTR : ‘దేవర’ నుంచి షూటింగ్ పిక్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్.. ఎన్టీఆర్ లుక్ అదిరిందిగా..

NTR new Look Working Still Released From Devara Shoot Photo goes Viral

NTR Look : అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్(NTR) దేవర సినిమా ప్రస్తుతం గోవాలో(Goa) షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షూట్ లో జాన్వీతో ఓ సాంగ్, కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారని సమాచారం. ఇవాళ ఉదయమే దేవర షూట్ నుంచి.. ఎన్టీఆర్ సముద్రంలోంచి నడిచొస్తున్న ఓ చిన్న వీడియో లీక్ అయింది. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

Also Read : Radha Krishna : ‘రాధేశ్యామ్’ పోయినా మళ్ళీ ఆ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్.. కానీ ఈ సారి..

తాజాగా దేవర మూవీ యూనిట్ అధికారికంగా షూట్ లొకేషన్ నుంచి ఓ ఫోటో రిలీజ్ చేసారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్, కొరటాల శివ ఉన్నారు. ఎలాంటి అప్డేట్ లేకుండా వర్కింగ్ స్టిల్ తో ఎన్టీఆర్ ఫోటోని రిలీజ్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతూ సంతోషిస్తున్నారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్ లుక్ మాసీగా అదిరిపోయింది అని కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ఇక దేవర సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అభిమానులు దేవర సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.