Radha Krishna : ‘రాధేశ్యామ్’ పోయినా మళ్ళీ ఆ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్.. కానీ ఈ సారి..

రాధేశ్యామ్ వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికి డైరెక్టర్ రాధాకృష్ణ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించలేదు.

Radha Krishna : ‘రాధేశ్యామ్’ పోయినా మళ్ళీ ఆ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్.. కానీ ఈ సారి..

Radhe Shyam Director Radha Krishna Next Movie under Prabhas

Updated On : March 22, 2024 / 10:31 AM IST

Radha Krishna : డైరెక్టర్ రాధాకృష్ణ పలు సినిమాలకు రచయితగా పనిచేసి గోపీచంద్(Gopichand) హీరోగా ‘జిల్'(Jil) సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా గోపీచంద్ ని మాత్రం ఈ సినిమాలో మంచి స్టైలిష్ గా చూపించాడు అని అంతా అభినందించారు. దీంతో ప్రభాస్ రాధాకృష్ణకు అవకాశం ఇవ్వడంతో ‘రాధేశ్యామ్'(Radhe Shyam) సినిమాని తీసాడు. ప్రభాస్(Prabhas) అభిమానులు టైటానిక్ రేంజ్ లవ్ స్టోరీ అంటూ ఆశపడి వెళ్తే రాధేశ్యామ్ సినిమాతో రాధాకృష్ణ నిరాశపరిచాడు. కొన్ని సాంగ్స్, విజువల్స్ తప్ప సినిమా పరంగా అంతగా ఎవ్వరికి నచ్చలేదు. కమర్షియల్ గా కూడా ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదు.

రాధేశ్యామ్ వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికి డైరెక్టర్ రాధాకృష్ణ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం రాధాకృష్ణకు ప్రభాస్ మళ్ళీ అవకాశం ఇచ్చాడని తెలుస్తుంది. అయితే ఈ సారి నిర్మాతగా అవకాశం ఇచ్చాడు ప్రభాస్. తన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో డైరెక్టర్ రాధాకృష్ణకు గోపీచంద్ తో సినిమా ఓకే చేసారని టాలీవుడ్ సమాచారం.

Also Read : RC 16 Movie : రామ్ చరణ్ RC16 విలన్ అతనేనా? 11 ఏళ్ళ తర్వాత ఆ బాలీవుడ్ స్టార్‌తో చరణ్.. ?

గతంలో గోపీచంద్ తో జిల్ సినిమా తీసిన రాధాకృష్ణ ఇప్పుడు మరోసారి గోపీచంద్ తో సినిమా తీయబోతున్నాడు. మరి ఈ సారి ఏ కాన్సెప్టుతో వస్తాడో, ఈ సారైనా హిట్ కొడతాడా అని చర్చిస్తున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు అయితే తనకి ఫ్లాప్ ఇచ్చినా నిర్మాతగా ఇంకో సినిమా ఇచ్చాడు అని ప్రభాస్ ని పొగిడేస్తున్నారు.