Krithi Shetty : ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. లాంటి పాటలు నేను చేయను.. కానీ సమంత..

కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వగా ఓ మీడియా ప్రతినిధి ఊ అంటావా.. ఊ ఊ అంటావా..లాంటి పాటలను చేస్తారా అని అడిగారు.

Krithi Shetty : ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. లాంటి పాటలు నేను చేయను.. కానీ సమంత..

Kriti Shetty says she will not do item songs

Updated On : May 13, 2023 / 6:51 AM IST

Krithi Shetty :  ఉప్పెన(Uppena)తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ ఆరిపోయిన కృతి శెట్టి ఆ తర్వాత కూడా వరుసగా రెండు విజయాలు సాధించినా ఇటీవల వరుస ఫ్లాప్స్ చూసింది. తాజాగా కస్టడీ(Custody) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కృతి. బంగార్రాజు(Bangarraju) తర్వాత నాగచైతన్య(Naga Chaitanya) తో కలిసి మరోసారి కస్టడీలో మెప్పించింది. ఈ సినిమా మంచి విజయం సాధించి మరోసారి ఈ పెయిర్ కి సక్సెస్ ని ఇచ్చింది.

ఇక కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వగా ఓ మీడియా ప్రతినిధి ఊ అంటావా.. ఊ ఊ అంటావా..లాంటి పాటలను చేస్తారా అని అడిగారు. దానికి కృతి సమాధానమిస్తూ.. ప్రస్తుతానికి నేను అలాంటి సాంగ్స్ చేయను. ఇప్పట్లో అయితే అలాంటి పాటలు ఒప్పుకోను. వాటిపై నాకు ఎలాంటి ఐడియా లేదు. నా సినీ ప్రయాణంలో నేను తెలుసుకున్నది ఒకటే. సౌకర్యంగా లేకపోతే చేయకపోవడమే మంచిది. కానీ ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. సాంగ్ లో సమంత మాత్రం చాలా బాగా డ్యాన్స్ చేసింది అని తెలిపింది.

Nikhil Siddhartha : ‘స్పై’ టీజర్ ఏకంగా దేశ రాజధానిలో రిలీజ్.. నిఖిల్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..

అయితే కృతి గతంలో శ్యామ్ సింగరాయ్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో నటించింది. ఆ సినిమా అప్పుడే రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది కృతి. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ తో సినిమాలో రొమాన్స్ ఉన్నా కృతి నుంచి ఐటెం సాంగ్స్ మాత్రం రావని అర్ధమవుతుంది. ప్రస్తుతానికి కృతి కస్టడీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది.