Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి విశ్వంభ‌ర‌లో బాలీవుడ్ న‌టుడు.. అధికారిక ప్ర‌క‌ట‌న‌

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న మూవీ విశ్వంభర.

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి విశ్వంభ‌ర‌లో బాలీవుడ్ న‌టుడు.. అధికారిక ప్ర‌క‌ట‌న‌

Kunal Kapoor joins Megastar Chiranjeevi film vishwambhara

Updated On : June 14, 2024 / 12:11 PM IST

Vishwambhara-Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న మూవీ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సోషియో ఫాంటసీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. వ‌రుస అప్‌డేట్‌ల‌తో సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతున్న చిత్ర బృందం తాజాగా మ‌రో అప్‌డేట్‌ను ఇచ్చింది. ఈ మూవీలో బాలీవుడ్ న‌టుడు కునాల్ క‌పూర్ న‌టిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. ఈయ‌న విశ్వంభ‌ర షూటింగ్‌లో జాయిన్ అయిన‌ట్లుగా ద‌ర్శ‌కుడు సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

కాగా.. కునాల్ ఏ పాత్ర‌లో న‌టిస్తున్నార‌నే విష‌యాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. అయితే.. ఈ మూవీలో కునాల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నారు అనే వార్త‌లు గ‌త కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. జూలై చివ‌రి నాటికి చిత్రీక‌ర‌ణ‌ను కంప్లీట్ చేయ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యం ఉన్న క్ర‌మంలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పై చిత్ర‌బృందం ప్ర‌త్యేక దృష్టి పెట్టింది.

Robinhood : నితిన్ ‘రాబిన్ హుడ్’ అప్డేట్.. దొంగ‌తో రొమాన్స్ చేయ‌నున్న‌దెవ‌రో తెలుసా..?

ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తుండ‌గా త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ లు హీరోయిన‌ట్లుగా న‌టిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. చోటా కెనాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌. ఈ మూవీ సంక్రాంతికి కానుక‌గా వ‌చ్చే ఏడాది 10 జనవరి 2025న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.