Laapataa Ladies : ‘లాపతా లేడీస్’కు షాక్.. ఆస్కార్‌లో షార్ట్ లిస్ట్‌లో దక్కని చోటు
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ మాజీ సతీమణి కిరణ్‌రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాపతా లేడిస్.

Laapataa Ladies out of Oscars 2025 race
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ మాజీ సతీమణి కిరణ్‌రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాపతా లేడీస్’. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అదరగొట్టింది. ఈ క్రమంలో ఈ చిత్రం 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి ఎంపికైన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ చిత్రానికి షాక్ తగిలింది. ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో ఈ మూవీ చోటు దక్కించుకోలేకపోయింది. డిసెంబర్ 17 ఆస్కార్ షార్ట్ లిస్ట్‌ను ప్రకటించగా అందులో లాపతా లేడీస్ చిత్రం లేదు. దీంతో సినీ ప్రియులు ఎంతో నిరాశకు గురి అయ్యారు.
‘లాపతా లేడీస్ చిత్ర బృందం ఆస్కార్ కోసం ఎంతో కష్టపడింది. అటు ఆమిర్‌ఖాన్, ఇటు కిరణ్‌రావు హాలీవుడ్ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. చిత్ర విశేషాలను పంచుకున్నారు. మరోపక్క వరుస స్క్రీనింగ్‌లను ప్రదర్శించారు.
Chiranjeeva : పక్కా ఇండియన్ స్టైల్ లో చిరంజీవ.. హీరో ఎవరంటే..
మహిళల స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్య్రం, భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం గురించి మాట్లాడగల శక్తి ఉన్న కథ ఇదని.. గొప్ప సందేశాత్మక చిత్రం కావడంతో ఖచ్చితంగా ఈ మూవీ ఆస్కార్ అందుకుంటుందని భారతీయ సినీ ప్రియులు ఆశించారు. వారికి నిరాశే ఎదురైంది.