Dr. Haritha Gogineni : రిలీజ్ కి ముందే తన సినిమాకు 70 ఇంటర్నేషనల్ అవార్డులు సాధించిన లేడీ డైరెక్టర్..
ఫియర్ సినిమా డిసెంబర్ 14న థియేట్రికల్ రిలీజ్ కానుంది.

Lady Director Dr Haritha Gogineni says about her Movie Vedhika Fear
Dr. Haritha Gogineni : వేదిక మెయిన్ లీడ్ గా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ‘ఫియర్’. దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మాణంలో డా. హరిత గోగినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కి ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70కి పైగా అవార్డ్ లను గెలుచుకుంది. ఫియర్ సినిమా డిసెంబర్ 14న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు డైరెక్టర్ డా. హరిత గోగినేని మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
హరిత గోగినేని ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. లక్కీ లక్ష్మణ్ సినిమాకు నిర్మాతగా చేస్తున్నప్పుడు అన్ని క్రాఫ్ట్స్ తో కలిసి పనిచేసుకున్నాను. ఆ అనుభవంతోనే ఈ సినిమాకు డైరెక్షన్ చేయాలి అనుకున్నాను. మూడేళ్ళ క్రితమే ఈ ఫియర్ కథ రాసుకున్నాను. లక్కీ లక్ష్మణ్ అయ్యాకే ఈ సినిమా మీద దృష్టి పెట్టాను. ఈ సినిమా మేకింగ్ పక్కా ప్లానింగ్ తో చేసుకున్నాను. ప్రీ ప్రొడక్షన్ లోనే ఏ సీన్ ఎంత ఉండాలి, ఏ షాట్ ఎంత సేపు పిక్చరైజ్ చేయాలని పక్కాగా రాసుకున్నాను. సినిమా రావడమే 2 గంటల ఫుటేజ్ వచ్చింది. దాంట్లో ఒక 8 నిమిషాలు ఎడిటింగ్ లో తీసేసాను. ఇంత పక్కాగా ఉంటేనే మేకింగ్ లో ఎలాంటి వేస్టేజ్ ఉండదు. నిర్మాత మీద భారం పడదు. ఇది రెగ్యులర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలను పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడరు. కానీ మా సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అని తెలిపారు.
Also Read : Allu Arjun : సంధ్య థియేటర్ ఘటనతో నేను షాక్ తిన్నాను.. కోలుకోడానికి రెండు రోజులు పట్టింది..
ఇక ఇందులో మెయిన్ లీడ్ లో నటించిన వేదిక గురించి మాట్లాడుతూ.. వేదిక కంటే ముందు కొంతమంది హీరోయిన్స్ ను అడిగాం కానీ వాళ్ళ డేట్స్ కోసం ఏడాది పాటు ఆగాల్సి రావడంతో అంత టైమ్ వేస్ట్ చేయడం ఇష్టం లేక వేరే హీరోయిన్స్ ని చూసాం. ఈ క్రమంలో వేదికని ఓకే చేసాము. వేదిక ముని, కాంచన 3 లాంటి సినిమాలో ఇలాంటి క్యారెక్టర్స్ బాగా చేసింది. మా సబ్జెక్ట్ కు ఆమె సెట్ అవుతుందని వెళ్లి మాట్లాడం. తనకు కూడా కథ నచ్చడంతో ఓకే చెప్పింది. వేదిక పర్ఫార్మెన్స్ చూసి కరెక్ట్ గా సరిపోయింది అనిపించింది అని తెలిపారు.
సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ.. సినిమా భయం గురించి చెప్తున్నాం కాబట్టి టైటిల్ భయం అనే పెట్టాలి అనుకున్నాం కానీ క్యాచీగా ఉండదని ఫియర్ అని పెట్టాము. ఫియర్ అంటే అన్ని భాషలకు రీచింగ్ ఉంటుంది. ఫిలిం ఫెస్టివల్స్ లో కూడా గుర్తింపు రావడానికి ఈ టైటిల్ ఒక కారణమైంది అని అన్నారు.
సినిమా పాన్ ఇండియా రిలీజ్ గురించి మాట్లాడుతూ.. మొదట ఫియర్ సినిమాను మల్టీపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ మాకు మిగతా భాషల్లో ప్రమోషన్ చేసి సెన్సార్ చేసే టైమ్ లేకపోవడంతో ఈ నెల 14న తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాం. ఆ తర్వాత మిగతా భాషల్లో విడుదల చేస్తాం అని అన్నారు. అలాగే.. ఫియర్ సినిమాని మా సర్కిల్ లో అందరికి చూపించాము. వాళ్లంతా కొత్త డైరెక్టర్ చేసినట్లు లేదు, చాలా క్వాలిటీగా ఉంది అని తెలిపారు.
ఈ సినిమా తర్వాత నవరసాల్లో అన్ని జానర్స్ కథల లైన్స్ నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. మంచి యాక్షన్ మూవీతో పాటు ఒక కామెడీ ఎంటర్ టైనర్ సినిమా నెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాను అని హరిత గోగినేని తెలిపారు. ఆస్ట్రాలజీలో డాక్టరేట్ తీసుకొని ఇప్పుడు ఇలా సినీ పరిశ్రమలో నిర్మాతగా, డైరెక్టర్ గా దూసుకెళ్తున్నారు. ఈ సినిమాకు ఈమె ఎడిటర్ గా కూడా పనిచేయడం గమనార్హం.