ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం టీజర్.. తెలుగింటి గ‌డ‌ప‌పై విర‌జిమ్మిన ‘విష‌ం’ 

  • Published By: vamsi ,Published On : March 13, 2019 / 05:44 AM IST
ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం టీజర్.. తెలుగింటి గ‌డ‌ప‌పై విర‌జిమ్మిన ‘విష‌ం’ 

Updated On : March 13, 2019 / 5:44 AM IST

ఎన్నికలవేళ దివంగత ఎన్‌టీఆర్ మీద సినిమాలు చేస్తూ ఎవరికి అనుకూలంగా వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమా విడుదలకు సిద్ధం అవగా.. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం అనే సినిమాను తీస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ల‌క్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఇంటి గ‌డ‌ప తొక్కుతుండగా.. గద్ద పైనుండి వెళ్లడం.. ఆ స‌మ‌యంలో తెలుగింటి గ‌డ‌ప‌పై విర‌జిమ్మిన ‘విష‌ం’ అనే క్యాప్ష‌న్ రాశారు. ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీ పార్వ‌తి వ‌చ్చిన త‌ర్వాత ఏం జ‌రిగింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Read Also : RRR Movie : 14న రాజమౌళి ప్రెస్ మీట్ !

టీజర్ విడుదల సంధర్భంగా.. ఎన్‌టీఆర్ జీవితంలో జరిగిన అత్యంత కీలకమైన ఘటలను చిత్రీకరిస్తున్నామని కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ తుది దశలో ఎదుర్కొన్న అత్యంత అవమానకరమైన, కీలకమైన సన్నివేశాలను సినిమాగా తీస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా ఎవరినీ ఉదేశించి తీయట్లేదని, ఏప్రిల్ తొలి వారంలో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు.

నాగరుషి ఫిలిమ్స్ సమర్పణలో, జయం మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో ల‌క్ష్మీ పార్వ‌తిగా శ్రీ రెడ్డి న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో ల‌క్ష్మీ పార్వ‌తికి సంబంధించిన పాజిటివ్ అంశాల‌ని వ‌ర్మ చూపించే ప్రయత్నం చేస్తుండగా, ఈ సినిమాలో నెగెటివ్ అంశాల‌ని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చూపించ‌నున్నట్లు చెబుతున్నారు.