Maharashtra CM Rrelief Fund : మహారాష్ట్ర సర్కార్ కు లతా విరాళం
ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మహారాష్ట్ర ప్రభుత్వానికి విరాళంఅందించారు.

Lata
Lata Mangeshkar : భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైగానే కేసులు నమోదవుతుండడం..మరణాల సంఖ్య అధికంగానే ఉంది. పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. కానీ ఉత్పత్తి ఆలస్యంగా జరుగుతుండడంతో పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది.
కొవిడ్ బాధితులకు కనీస సౌకర్యాలు అందడం లేదు. ఆక్సిజన్ కొరతతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వైద్య పరికరాలు, ఆక్సిజన్, మందుుల సమకూర్చుకోవడంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అష్టకష్టాలు పడుతున్నాయి. దీనితో కొందరు ప్రముఖులు ముందుకు వచ్చి..తోచిన సహాయం అందిస్తున్నారు.
తాజాగా ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మహారాష్ట్ర ప్రభుత్వానికి విరాళంఅందించారు. మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇటీవలే రూ.7 లక్షల విరాళం ప్రకటించారని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల శాఖ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. సహాయం ప్రకటించడం పట్ల…లతా మంగేష్కర్ కు మహారాష్ట్ర సి.ఎం. ఉద్ధవ్ థాకరే ధన్యవాదాలు తెలిపారు.