PawanKalyan: భీమ్లా నాయక్ షూటింగ్‌లో పవన్ కళ్యాణ్‌తో మంచు మనోజ్
మా ఎన్నికల వేళ మెగా, మంచు కుటుంబాల మధ్య ఎటువంటి వార్ నడిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Pawan Kalyan
PawanKalyan: మా ఎన్నికల వేళ మెగా, మంచు కుటుంబాల మధ్య ఎటువంటి వార్ నడిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా రిపబ్లిక్ సినిమా ప్రీ-రిలీజ్ సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు ఎటువంటి హీట్ పుట్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే, లేటెస్ట్‌గా టాలీవుడ్ యంగ్ హీరో, రాకింగ్ స్టార్, మంచువారబ్బాయి మనోజ్ భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్‌కి వెళ్లి పవన్ కళ్యాణ్‌తో భేటి అయ్యారు.
ఈ భేటిలో పలు రాజకీయ, సామాజిక, సినిమా అంశాలపై చర్చలు జరిగాయి. స్వతహాగా పవన్ కళ్యాణ్ అంటే మంచు మనోజ్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉండగా.. మనోజ్ పట్ల కూడా పవన్ కళ్యాణ్ అదే సోదరభావంతో ఉంటారు. వీరిద్దరూ గంటకుపైగా చిత్ర పరిశ్రమలో చోటుచేసుకున్న పరిణామాలతోపాటు చర్చించుకున్నారు. ఇండస్ట్రీలోని సమస్యలపై ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదంటూ మోహన్ బాబును పవన్ ప్రశ్నించారు.
సీఎం జగన్ బంధువైన మోహన్ బాబు ఎందుకు ప్రశ్నించట్లేదు అని నిలదీయగా.. ఇప్పుడు వీరిద్దరి భేటి ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు లేటెస్ట్ చిత్రాల ప్రస్తావన కూడా వీరిద్దరి మధ్య వచ్చినట్లుగా చెబుతున్నారు.