వెంకట్ ప్రభు దర్శకత్వంలో లారెన్స్
ప్రముఖ కొరియోగ్రాఫర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా ఫేమస్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది..

ప్రముఖ కొరియోగ్రాఫర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా ఫేమస్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది..
‘ముని’ సీక్వెల్స్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు డైరెక్టర్ కమ్ యాక్టర్ రాఘవ లారెన్స్.. ‘కాంచన 3’తో ఇటీవల హిట్ కొట్టిన లారెన్స్ తర్వాత హీరోగా కూడా వేరే దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్‌గా టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు చెప్పిన స్క్రిప్ట్‌కి లారెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
‘సరోజ’, ‘గాంబ్లర్’, ‘బిరియాని’ వంటి డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకున్న వెంకట్ ప్రభు, లారెన్స్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం లారెన్స్ ‘కాంచన’ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
అక్షయ్ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘లక్ష్మీ బాంబ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తవగానే లారెన్స్ హీరోగా బిజీ కానున్నాడు. టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రంగస్థలం’ రీమేక్‌కి కూడా లారెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లింగు స్వామి దర్శకత్వంలో ఈ రీమేక్ రూపొందనుంది.
God is kind
Nalladhey ninaipom
Nalladhey pesuvom
Nalladhey nadakkum
And so this happened!!
Thank q @offl_Lawrence brother!!! Updates soon ???? pic.twitter.com/elF9IZjFhY— venkat prabhu (@vp_offl) December 4, 2019