రజనీ పార్టీలో చేరడానికి లారెన్స్ రిక్వెస్ట్ ఏంటయ్యా అంటే..

  • Published By: sekhar ,Published On : September 14, 2020 / 03:14 PM IST
రజనీ పార్టీలో చేరడానికి లారెన్స్ రిక్వెస్ట్ ఏంటయ్యా అంటే..

Updated On : September 14, 2020 / 4:15 PM IST

Lawrence request to Rajinikanth: కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన ఆరాధ్యదైవం సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఓ రిక్వెస్ట్ చేశారు. వివరాళ్లోకి వెళ్తే.. తాను త్వరలో రాజకీయ ప్రవేశం చేయబోతున్నానని.. గురువు, తనకు దైవంతో సమానమైన రజినీకాంత్ పార్టీలో చేరతానని ఇటీవల లారెన్స్ ప్రకటించారు. లారెన్స్ రాజకీయ ప్రకటన గురించి తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలవారు ఆసక్తిగా చర్చించుకుంటుండగా.. ఇంతలో తాను పార్టీలో చేరడం పక్కా.. కాకపోతే తలైవర్‌కు నా రిక్వెస్ట్.. అంటూ లారెన్స్ ట్వీట్ చేయడంతో అంతా షాక్ అయ్యారు.




ఇంతకీ లారెన్స్ రిక్వెస్ట్ ఏంటయ్యాఅంటే..
రజినీకాంత్ సీఎం అభ్యర్థి అయితేనే తాను పార్టీలో చేరతానని, వేరే వ్యక్తి అయితే అందుకు తాను అంగీకరించబోనని లారెన్స్ స్పష్టం చేశారు లారెన్స్. పార్టీలో అనుభవం వున్న వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని, తను ముఖ్యమంత్రి అభ్యర్థిని కానని గతంలో రజనీ చెప్పిన విషయం తెలిసిందే. కాగా రజినీ ఇప్పుడు తన నిర్ణయాన్ని పున:పరిశీలించుకోవాలని కోరుతూ లారెన్స్ ట్వీట్ చేయడంతో.. లారెన్స్ రిక్వెస్ట్‌పై రజినీ ఎలా స్పందిస్తారోనని తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
https://10tv.in/lawrence-hints-rajinikanths-political-party/