Laxmmi Bomb Trailer: అక్షయ్ అదరగొట్టేశాడు!

  • Published By: sekhar ,Published On : October 9, 2020 / 02:11 PM IST
Laxmmi Bomb Trailer: అక్షయ్ అదరగొట్టేశాడు!

Updated On : October 9, 2020 / 2:25 PM IST

Laxmmi Bomb Trailer: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన హారర్ కామెడీ చిత్రం ‘లక్ష్మీ బాంబ్’.. తెలుగు, తమిళంలో మంచి విజయం సాధించిన ‘కాంచన’ హిందీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా మాతృకను రూపొందించిన రాఘవ లారెన్స్ బాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు.


కైరా అద్వాని కథానాయిక. శుక్రవారం ‘లక్ష్మీ బాంబ్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒరిజినల్ వెర్షన్లో శరత్ కుమార్ చేసిన కీలకమైన హిజ్రా పాత్రను కూడా అక్షయ్ కుమారే చేస్తుండడం విశేషం. తన మార్క్ కామెడీతో పాటు నటనతోనూ ఆకట్టుకున్నారు అక్షయ్. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.


కరోనా కారణంగా ‘లక్ష్మీ బాంబ్’ మూవీని ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమాను థియేటర్లలోనే చూసేందుకు అక్షయ్ ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురు చూశారు కానీ కుదర్లేదు. అయితే ఈ సినిమా భారత్‌లోని థియేటర్లలో విడుదల కాకపోయినా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూఏఈ తదితర దేశాలలో నవంబరు 9న వెండితెరపై విడుదల కానుంది.
దీపావళి కానుకగా నవంబర్ 9న హాట్‌స్టార్‌లో ‘లక్ష్మీ బాంబ్‌’ స్ట్రీమింగ్ కానుంది. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, షబీనా ఖాన్, తుషార్ కపూర్ కలిసి నిర్మించారు.