గాన గంధర్వుడి గాత్రం మూగబోయింది..

  • Published By: sekhar ,Published On : September 25, 2020 / 01:38 PM IST
గాన గంధర్వుడి గాత్రం మూగబోయింది..

Updated On : September 25, 2020 / 3:32 PM IST

SP Balu: గత ఐదు దశాబ్దాలుగా తన గానామృతంతో సంగీత ప్రియులను, ప్రేక్షకులను అలరించిన ఆ గానగంధర్వుని స్వరం మూగబోయింది. కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం కన్నుమూసినట్లుగా అధికారికంగా ప్రకటించారు.




కరోనా నుంచి కొలుకున్నాక మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో బాలు పరిస్థితి విషమంగా మారింది. గత 24 గంటలుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యానికి స్పందిస్తూ రోజురోజుకీ కోలుకుంటున్న బాలు గారు త్వరలో తిరిగి మనముందుకు వస్తారు అని ఎదురు చూసిన వారికి ‘ఇక శెలవు’ అంటూ అనంత లోకాలకు తరలివెళ్లిపోయారు.

బాలు మరణవార్త వినగానే తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమ వర్గాలు షాక్ అయ్యాయి. సంగీత ప్రియులు, బాలు అభిమానులు ఆయన మరణ వార్తతో శోక సంద్రంలో మునిగిపోయారు.