Leo Movie : ఖైదీ, విక్రమ్‌ సినిమాలతో లియో కనెక్షన్.. నెట్టింట వైరల్ అవుతున్న సీన్స్..

లియో సినిమా LCUలో భాగంగానే ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఖైదీ, విక్రమ్‌ సినిమాలతో ఈ మూవీకి కనెక్షన్ పెట్టారు. ఖైదీ సినిమాలో..

Leo Movie : ఖైదీ, విక్రమ్‌ సినిమాలతో లియో కనెక్షన్.. నెట్టింట వైరల్ అవుతున్న సీన్స్..

Leo Movie connection with Kaithi Vikram movie part of LCU

Updated On : October 19, 2023 / 8:39 AM IST

Leo Movie : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘మాస్టర్’ సినిమా తరువాత విజయ్ చేస్తున్న సినిమా ‘లియో’. మూవీ అనౌన్స్‌మెంట్ తోనే భారీ హైప్ ని క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం నేడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. కాగా లోకేష్ తెరకెక్కించిన గత సినిమాలు విక్రమ్, ఖైదీకి కనెక్షన్ పెట్టి ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీ కూడా ఆ యూనివర్స్ లో భాగంగానే వస్తుందా..? అనేది ఆడియన్స్ లో ముందు నుంచి ఉన్న క్యూరియాసిటీ.

ఇక ఆ ఆసక్తికి తెరపడింది. ఈ సినిమా LCUలో భాగంగానే ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఖైదీ, విక్రమ్‌ సినిమాలతో ఈ మూవీకి కనెక్షన్ పెట్టారు. ఖైదీ సినిమాలో కానిస్టేబుల్ ‘నెపోలియన్’ పాత్రని ఈ సినిమాలో చూపించారు. అలాగే ఖైదీలో న్యూస్ ని ఒక వార్త పత్రిక ద్వారా చూపించాడు. అలాగే కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో కూడా కనెక్షన్ చూపించారు. విక్రమ్ సినిమాలో మాస్క్ వేసుకొని హీరో గ్యాంగ్ కనిపిస్తుంటుంది. అదే మాస్క్ వేసుకొని కమల్ హాసన్ వాయిస్ తో విజయ్ కి కాల్ చేయడం సినిమాలో కనిపిస్తుంది. ఇక ఈ సీన్స్ ఆడియన్స్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Also read : Leo Movie : లియో ట్విట్టర్ టాక్ ఏంటి..? ఈ సినిమా LCUలో భాగమేనా..?

కాగా ఈ మూవీలో రామ్ చరణ్ నటిస్తున్నాడు అంటూ వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేలిపోయింది. ఈ సినిమాలో ఏ ఇతర హీరో గెస్ట్ అపిరెన్స్ లేదు. ప్రీమియర్ షోల్లో జస్ట్ ఓకే టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ.. ఫస్ట్ ఎలాంటి టాక్ ని అందుకుంటుందో చూడాలి. అయితే ఈ మూవీ పై ఉన్న బజ్ కి భారీ ఓపెనింగ్స్ మాత్రం నమోదు అవుతాయి.