Sanjay Dutt : ఆంటోని దాస్‌గా సంజయ్ దత్.. స్పెషల్ వీడియో.. విజయ్‌కు తగ్గ విలనే.. గూస్‌బంప్స్..
ఇళయదళపతి విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న చిత్రం లియో(Leo). లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది.

Sanjay Dutt First Look from leo
Sanjay Dutt First Look from Leo : ఇళయదళపతి విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న చిత్రం లియో(Leo). లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది. విలన్‌గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt ) నటిస్తున్నాడు. శనివారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం.
ఈ చిత్రంలో సంజయ్ దత్ ఆంటోని దాస్‌గా కనిపించనున్నాడు. ఆంటోని లుక్ రివీల్ చేస్తూ వీడియో విడుదల చేయగా బ్యా గ్రౌండ్ స్కోరు అదిరిపోయింది. చాలా స్టైలిష్ విలన్‌గా సంజయ్ దత్ కనిపిస్తున్నాడు. సిగరేట్ తాగుతూ, ఫోన్ మాట్లాడుతూ సలామ్ చేస్తున్నట్లుగా ఉన్న ఆంటోని లుక్ వైరల్‌గా మారింది.
Meet #AntonyDas 🔥🔥
A small gift from all of us to you @duttsanjay sir! It was indeed a pleasure to work with you!🤜🤛#HappyBirthdaySanjayDutt ❤️#Leo 🔥🧊 pic.twitter.com/UuonlCF3Qa— Lokesh Kanagaraj (@Dir_Lokesh) July 29, 2023
ఇక ఈ సినిమాలో గౌతమ్ మీనన్, అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్ లు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా డబ్బింగ్, సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెవన్ స్క్రీన్ స్టూడియో ఈ చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ బాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
Rajinikanth : కావ్య బాధపడుతుంటే చూడలేకపోతున్నా.. మారన్ వెంటనే ఈ పని చేయండి
అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ శాటిలైట్, డిజిటల్ అండ్ మ్యూజిక్ రైట్స్ దాదాపు 220 కోట్లకు అమ్ముడుపోయినట్లు ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో కలిపి 202 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం మీద విడుదలకు ముందే 422 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.