ఆకట్టుకుంటున్న ‘లైఫ్‌ ఆఫ్‌ జోహార్‌’

అయిదు పాత్రలతో ఆకట్టుకుంటున్న ‘లైఫ్‌ ఆఫ్‌ జోహార్‌’ వీడియో..

  • Published By: sekhar ,Published On : January 25, 2020 / 07:36 AM IST
ఆకట్టుకుంటున్న ‘లైఫ్‌ ఆఫ్‌ జోహార్‌’

Updated On : January 25, 2020 / 7:36 AM IST

అయిదు పాత్రలతో ఆకట్టుకుంటున్న ‘లైఫ్‌ ఆఫ్‌ జోహార్‌’ వీడియో..

ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై తేజ మార్ని దర్శకత్వంలో భాను సందీప్ మార్ని నిర్మాతగా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా ‘జోహార్’. ‘దృశ్యం’ చిత్రంలో వెంకటేశ్ కూతురిగా నటించిన ఎస్తర్ అనిల్ ఇందులో హీరోయిన్‌గా నటించారు. ‘వంగవీటి’, ‘బ్యూటిఫుల్’ ఫేమ్ నైనా గంగూలీ మెయిన్ హీరోయిన్‌గా నటించారు.

Johar Movie First Look Released - Sakshi

తనదైన నటనతో ఎన్నో చిత్రాల్లో మెప్పించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరీరావు కీలక పాత్ర పోషించగా రోహిణి, శుభలేఖ సుధాకర్, చైతన్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. శనివారం ‘లైఫ్‌ ఆఫ్‌ జోహార్‌’ పేరుతో సినిమాకు సంబంధించిన చిన్న వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

Read Also : ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ ‘1917’

Life Of Johaar from Johar

సినిమా కథ అంతా అయిదు పాత్రల చుట్టూ తిరుగుతుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ‘లైఫ్‌ ఆఫ్‌ జోహార్‌’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కెమెరా : జగదీష్ చీకటి, సంగీతం : ప్రియదర్శన్, మాటలు : వంశీ, లిరిక్స్ : చైతన్య ప్రసాద్, ఆర్ట్ : గాంధీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనిల్ చౌదరి.