Liger: సోషల్ మీడియాను షేక్ చేసిన లైగర్.. అల్ ఇండియా రికార్డ్!
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన..
Liger: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లింప్స్ ఏకంగా ఆల్ టైం ఇండియన్ రికార్డునే సెట్ చేసి పారేసింది. ఈ సినిమా గ్లింప్స్ కి గాను 24 గంటల్లో ఏకంగా 15.92 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టి ఆల్ టైం ఇండియా రికార్డు సెట్ చేసింది.
2021 Hindi OTT Releases: బాలీవుడ్‌ను ఆదుకున్న డిజిటల్ కంటెంట్!
మొత్తం రీజనల్, పాన్ ఇండియన్ సినిమాల్లో కూడా ఇప్పుడు లైగర్ గ్లింప్స్ కు అత్యధికం. దీని బట్టి ఈ సినిమాకి క్రేజ్ ఏ లెవెల్లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. పూరి, చార్మీ, కరణ్ జొహార్ కలిసి పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ. ఈ సినిమాతో బాలీవుడ్ భామ అనన్య పాండే తెలుగు తెరకి పరిచయమవుతోండగా.. వచ్చే ఏడాది ఆగష్టు 25న రిలీజ్ కానుంది.
Karthikeya: ‘తల’తోనే ఢీ అంటే ఢీ.. యంగ్ హీరో ఫేట్ మారిపోతుందా?
గతానికి భిన్నంగా ఏళ్ళు తడబడి పూరి జగన్నాధ్ చేస్తున్న సినిమా ఇది కాగా.. అందుకు తగ్గ అవుట్ ఫుట్ సినిమాలో కనిపిస్తుంది. దానికి ఉదాహరణే గ్లింప్స్. చాలాకాలంగా అడపాదడపా ఫోటోలతోనే కాలం గడిపేసిన లైగర్ నుండి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురూచూస్తున్నారు. లేట్ గా వచ్చిన లేటెస్ట్ వస్తామంటూ ఇదిగో మా వర్క్ శాంపిల్ అంటూ క్రేజీ ట్రీట్ ఇచ్చేశారు పూర్ అండ్ కో. పూరి మార్క్ టేకింగ్, రౌడీ మేనరిజంతో నిండిన ఈ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.