Bigg Boss 5 : వీళ్ళే నా శత్రువులు: లోబో

నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో దివాళి స్పెషల్ ఎపిసోడ్ చేశారు. ఇదే ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఘట్టం కూడా జరిగింది. లోబో ఎలిమినేట్ అయి బయటకి వచ్చాడు. స్టేజ్ పైకి వచ్చిన లోబో హౌస్ లోని సభ్యుల

Bigg Boss 5 : వీళ్ళే నా శత్రువులు: లోబో

Lobo

Updated On : November 1, 2021 / 7:49 AM IST

Bigg Boss 5 :  బిగ్‌బాస్ తెలుగు 5వ సీజ‌న్‌లో ఇప్పటికి 8 వారాలు పూర్తయ్యాయి. మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. 19 మందితో మొదలు పెట్టిన బిగ్ బాస్ లో సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీద, శ్వేతా, ప్రియాలు ఇప్పటి దాకా ఎలిమినేట్ అయ్యారు. ఇక 8వ వారం ఎలిమినేషన్స్ లో లోబో ఎలిమినేట్ అయ్యాడు. ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన లోబో ఇన్నాళ్లు సేఫ్ అవుతూ వచ్చాడు. నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో దివాళి స్పెషల్ ఎపిసోడ్ చేశారు. ఇదే ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఘట్టం కూడా జరిగింది. లోబో ఎలిమినేట్ అయి బయటకి వచ్చాడు. స్టేజ్ పైకి వచ్చిన లోబో హౌస్ లోని సభ్యుల గురించి చెప్పాడు.

Adipurush : ‘ఆదిపురుష్’ సినిమాని చిన్న చిన్న సెట్స్ లో తీశారు.. ఎందుకని అడిగితే..

స్టేజీ మీదకు వచ్చిన లోబోతో ఐదుగురు మిత్రులు – ఆరుగురు శత్రువులు గేమ్‌ ఆడించాడు నాగార్జున. ఈ గేమ్ లో లోబో హౌస్ లోని కంటెస్టెంట్స్ లో ఎవరు తనకు మిత్రులో, ఎవరు తనకు శత్రువులో చెప్పాలి. లోబో ముందుగా ఫ్రెండ్స్‌ గురించి చెప్పాడు. నాకు ఎప్పుడూ బూస్ట్‌ ఇచ్చే విశ్వ తన ఫ్రెండ్‌ అని అన్నాడు. అలాగే కాజల్‌, సన్నీ, రవి కూడా తన మిత్రులే అని చెప్పాడు. ఇంకో ఫ్రెండ్ యానీ మాస్టర్ అన్నాడు. యాని మాస్టర్ కెప్టెన్‌ అయితే మా గల్లీలో పటాకులు కలుస్తాను అని అన్నాడు. ఇక శత్రువుల గురించి అడిగితే హౌస్ లో షణ్ముఖ్‌, జెస్సీ, సిరి, మానస్‌, పింకీ, శ్రీరామ్‌ లు నాకు శత్రువులని అన్నాడు. మొత్తంగా బిగ్ బాస్ దివాళి స్పెషల్ వీకెండ్ ఎపిసోడ్ సెలబ్రిటీలు రావడంతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగింది.