Lokesh Kanagaraj : సూర్యతోనే నా డ్రీం ప్రాజెక్ట్.. ఆల్రెడీ కథ కూడా రాసుకున్నా.. లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవే..

తాజాగా ఓ ఈవెంట్ కి లోకేష్ హాజరవ్వగా అక్కడ విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ తన నెక్స్ట్ సినిమాల గురించి తెలిపాడు.

Lokesh Kanagaraj : సూర్యతోనే నా డ్రీం ప్రాజెక్ట్.. ఆల్రెడీ కథ కూడా రాసుకున్నా.. లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవే..

Lokesh Kanagaraj upcoming movies and his dream project with hero Suriya

Updated On : July 20, 2023 / 7:12 AM IST

Lokesh Kanagaraj Movies :  ప్రస్తుతం తమిళ్ లోనే కాకుండా ఇండియా అంతా వినపడుతున్న యువ డైరెక్టర్ పేరు లోకేష్ కనగరాజ్. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన మా నగరం సినిమాతో లోకేష్ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వకపోయినా మంచి ప్రశంశలు తెచ్చిపెట్టింది. దీనికంటే ముందే ఓ ఆంథాలజీ సినిమాలో ఒక పార్ట్ ని కూడా డైరెక్ట్ చేశాడు. 2019 లో కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ సినిమా ఒక్కసారిగా లోకేష్ ని స్టార్ డైరెక్టర్ ని చేసేసింది.

ఖైదీ సినిమా భారీ హిట్ అవ్వడం, సినిమా కొత్తగా ఉండటం, తక్కువ రోజుల్లో షూటింగ్ చేయడం.. ఇవన్నీ లోకేష్ కి కలిసొచ్చి వరుస ఆఫర్స్ వచ్చాయి. ఖైదీ తర్వాత విజయ్ తో మాస్టర్ సినిమా తీసి సక్సెస్ కొట్టాడు. ఆ తర్వాత చాలా ఏళ్లుగా ఫ్లాప్స్ లో ఉన్న కమల్ హాసన్ కి విక్రమ్ సినిమాతో పెద్ద హిట్ ఇచ్చి ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు లోకేష్. ఇక తన ప్రతి సినిమాకి ఏదో ఒక లింక్ పెడుతూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సృష్టించుకొని తన సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా చేశాడు.

లోకేశ్ ప్రస్తుతం విజయ్ లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. లియో సినిమా ఈ సంవత్సరం దసరాకి రిలీజ్ కానుంది. లియో తర్వాత లోకేశ్ రజినీకాంత్ సినిమాపై వర్క్ చేయనున్నాడు. ఇది కూడా తన లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉండబోతుందని సమాచారం. రజినీకాంత్ సినిమా 2024 ఫిబ్రవరిలో మొదలవ్వనుంది. ఆ సినిమా తర్వాత ఖైదీ 2, విక్రమ్ సీక్వెల్ ఉండనున్నాయి. తాజాగా ఓ ఈవెంట్ కి లోకేష్ హాజరవ్వగా అక్కడ విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ తన నెక్స్ట్ సినిమాల గురించి తెలిపాడు.

Allu Arjun : బేబీ కోసం ప్రత్యేకంగా ఈవెంట్ పెడుతున్న ఐకాన్ స్టార్.. 40 కోట్లు దాటేసిన కలెక్షన్స్..

లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్నాను. అది అయ్యాక రజినీకాంత్ సర్ సినిమా తీస్తాను. ఆ తర్వాత ఖైదీ 2 ఉంటుంది. విక్రమ్ కి సీక్వెల్ ఉంటుంది. సూర్య సర్ కోసం నేను పదేళ్లుగా ఇరుంబు కై మాయావి అనే ఓ కథ కూడా రాసుకున్నాను. అది నా డ్రీం ప్రాజెక్టు. సూర్య సర్ తో నా డ్రీం ప్రాజెక్టు ఉంటుంది. కానీ అది ఎప్పుడు ఉంటుందో చెప్పలేను. అజిత్ సర్ ఛాన్స్ ఇస్తే ఆయనతో కూడా సినిమా చేస్తాను అని తెలిపాడు. ఇక గతంలో చెప్పినట్టే ఓ 10 సినిమాల తర్వాత నేను డైరెక్టర్ గా సినిమాల నుంచి తప్పుకుంటాను అని మళ్ళీ ప్రకటించాడు.