Love Story Trailer : ‘చస్తే చద్దాం.. కానీ తేల్చుకుని చద్దాం’.. చైతు బెస్ట్ పెర్ఫార్మెన్స్..

లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది..

Love Story Trailer : ‘చస్తే చద్దాం.. కానీ తేల్చుకుని చద్దాం’.. చైతు బెస్ట్ పెర్ఫార్మెన్స్..

Love Story Trailer

Updated On : September 13, 2021 / 12:54 PM IST

Love Story Trailer: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరీ’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. సంస్థలు నిర్మించాయి..

Love Story : లేట్ అయినా లేటెస్ట్‌గా ‘లవ్ స్టోరీ’..

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘ఏవో ఏవో కలలే’, ‘నీ చిత్రం చూసి’, ‘సారంగ దరియా’ పాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలోనూ.. మొబైల్ రింగ్ టోన్స్‌ గానూ మారుమోగుతున్నాయి. సోమవారం ‘లవ్ స్టోరీ’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

LOVE STORY

ఈ సినిమా కోసం చైతన్య చాలా బాగా మేకోవర్ అయ్యాడు. సినిమా సినిమాకి నటుడిగా తనను తాను సాన బెట్టుకుంటున్న చైతు కెరీర్‌లో ‘లవ్ స్టోరీ’ వన్ ఆఫ్ ది మెమరబుల్ మూవీగానూ, నటుడిగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా గానూ మిగిలిపోతుంది. ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్, తెలంగాణా స్లాంగ్‌లో డైలాగ్ డెలివరీ.. ఇలా ప్రతి విషయంలోనూ ఆకట్టుకున్నాడు.

Chaitanya

ఇక సాయి పల్లవి గురించి అందరికీ తెలిసిందే. ‘ఫిదా’ తర్వాత మరోసారి తెలంగాణ యువతికగా అలరించనుందని అర్థమవుతుంది. డ్యాన్స్ అయితే హీరో హీరోయిన్లు ఇద్దరూ పోటీ పడి మరీ వేశారు. ‘బీటెక్ బీటెక్కే.. డ్యాన్స్ డ్యాన్సే.. బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవా దగ్గర జాబ్ అడిగితే ఏమంటాడు.. దొబ్బెయ్యమంటాడు.. మనకి ఆస్తులుండవ్.. లోన్లు రావ్.. ఇళ్లు కూడా రెంట్ కియ్యరు.. పిల్లనిస్తార్రా.. చస్తే చద్దాం కానీ తేల్చుకుని చద్దాం’.. వంటి డైలాగ్స్ చాలా బాగున్నాయి.

Saranga Dariya​​ : సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సారంగ దరియా’..

ఈశ్వరీ రావు, దేవయాని, రాజీవ్ కనకాల, ఉత్తేజ్.. ఇలా ప్రతీ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. విజయ్ సి.కుమార్ విజువల్స్ అందంగా ఉన్నాయి. పవన్ సంగీతం చాలా చక్కగా కుదిరింది. ‘లవ్ స్టోరీ’ సినిమాను సెప్టెంబర్ 24 గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చెయ్యబోతున్నారు.