మెత్తగున్నానని మజాక్ జేస్తున్నవా?.. ట్రైలర్ కిరాక్ ఉందిగా!

  • Published By: sekhar ,Published On : November 12, 2020 / 01:49 PM IST
మెత్తగున్నానని మజాక్ జేస్తున్నవా?.. ట్రైలర్ కిరాక్ ఉందిగా!

Updated On : November 12, 2020 / 2:07 PM IST

Maa Vintha Gaadha Vinuma: ఫ్రెష్ కంటెంట్‌తో వెబ్ సిరీస్, మూవీస్ రూపొందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న పాపులర్ ఓటీటీ ‘ఆహా’ అందిస్తున్న యూత్ ఎంటర్‌టైనర్.. ‘మా వింత గాధ వినుమా’.. ఇటీవల ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ తో అలరించిన సిద్ధు జొన్నలగడ్డ, శీరత్ కపూర్ మెయిన్ లీడ్స్‌‌గా ఆదిత్య మందల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మా వింత గాధ వినుమా’ ట్రైలర్ తాజాగా విడుదల చేశారు.


ఈ సినిమాకి సిద్ధు రైటింగ్‌తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించడం విశేషం. కాలేజ్, లవ్, బ్రేకప్.. ఇలా రియాలిటీకి దగ్గరగా యూత్‌ని బేస్ చేసుకుని రాసుకున్న ఈ కథ కచ్చితంగా ఆకట్టుకుంటుందని ట్రైర్ చూస్తే అర్థమవుతోంది. సిద్ధు, తనికెళ్ల భరణికి తన కథ చెప్పడం అనేది ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించి సినిమాపై అంచనాలు పెంచారు.


లక్ష్మీ మంచు, తనికెళ్ల భరణి, కమల్ కామరాజు, కల్పిక గణేష్, ప్రగతి, వైవా హర్ష తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల, రోహిత్ – జోయ్ సంగీతం, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటొగ్రఫీ అందించారు. నవంబర్ 13న ఆహాలో ‘మా వింత గాధ వినుమా’ వరల్డ్ ప్రీమియర్ కానుంది.