Maamagaru Serial : సెప్టెంబర్ 11 నుంచి మామగారు.. ఏ ఛానల్‌లో ప్ర‌సారం కానుందంటే..?

ఆకట్టుకునే కథనాలు, వాస్తవికతకు దగ్గరగా వుండే కథలతో కూడిన సీరియ‌ల్స్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను రంజింప‌జేస్తోంది స్టార్ మా. తాజాగా స‌రికొత్త సీరియ‌ల్‌తో తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు సిద్ద‌మైంది.

Maamagaru Serial : సెప్టెంబర్ 11 నుంచి మామగారు.. ఏ ఛానల్‌లో ప్ర‌సారం కానుందంటే..?

Maamagaru Serial

Updated On : September 10, 2023 / 8:41 PM IST

Maamagaru Serial : ఆకట్టుకునే కథనాలు, వాస్తవికతకు దగ్గరగా వుండే కథలతో కూడిన సీరియ‌ల్స్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను రంజింప‌జేస్తోంది స్టార్ మా. తాజాగా స‌రికొత్త సీరియ‌ల్‌తో తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు సిద్ద‌మైంది. మామ‌గారు అంటూ వ‌స్తోంది. ఈ నెల 11 నుంచి ఈ సీరియ‌ల్ ప్రారంభం కానుంది. సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు ప్ర‌తి రోజు 6.30 గంట‌ల‌కు స్టార్ మా లో ఈ సీరియ‌ల్ ప్ర‌సారం కానుంది.

అహంకారానికి, ఆత్మవిశ్వాసానికి నడుమ జరిగిన పోరులా ఈ సీరియ‌ల్ ఉంటుంది. గంగ డిగ్రీ పూర్తి చేసి పీజీ చేయాలని బావిస్తుంటుంది. మంచి ఉద్యోగంలో చేరి వికలాంగురాలైన చెల్లెలు, అమ్మ నాన్నలను కంటికి రెప్పలా చూసుకోవాలని కోరుకునే ఆరాట‌ప‌డుతుంటుంది. బాగా చదువుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే ఒక పెద్ద కుటుంబం లో కోడలిగా అడుగు పెట్టాలని కోరుకుంటుంది.

చెంగయ్య.. ఓ పెద్ద మనిషి. తన మాటే చెల్లుబాటు కావాలనుకునే పంతం కలిగిన పేరున్న కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన మూడో కొడుకు గంగాధరన్‌కు చదువుపై ఆసక్తి లేకపోవడంతో చిన్నతనంలోనే ఎలక్ట్రీషియన్‌గా పనికి వెళ‌తాడు. తండ్రి చేత తిట్లు తినే అతడు, ఈ బాధల నుంచి విముక్తి కావాలనుకుంటూ తప్పుడు సర్టిఫికెట్లు తో దుబాయ్‌కి వెళ్లాలనే ప్రణాళిక చేస్తాడు. అయితే.. అతను ఫోర్జరీ చేయాలనుకున్నది గంగకు చెందిన సర్టిఫికేట్‌లు కావటం.. ఈ విషయం తెలిసి గంగ ఫిర్యాదు చేయటం తో, ప్రభుత్వం గంగాధరన్ పాస్‌పోర్ట్‌ను నిషేదిస్తుంది. పెళ్లి చేస్తే అయినా తమ కుమారుడు గంగాధరన్ మారతాడని భావించి, చెంగయ్య తన సోదరి కుమార్తె సుభద్రతో గంగాధరన్‌కు వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ సుభద్ర గంగాధరన్‌ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుంది.

Priyamani : పుష్ప 2లో ప్రియ‌మ‌ణి..? ఆ వార్త విని ఆశ్చర్యపోయా..

అయినప్పటికీ చెంగయ్య పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. తన స్నేహితుడి కుమార్తె గంగతో గంగాధరన్ పెళ్లి చేయాలని చెంగయ్య ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో గంగ తండ్రికి ప్రాణాపాయ స్థితి ఏర్పడటం.. డబ్బుకు ఇబ్బంది పడుతున్న గంగకు ధన సహాయం చేసి ఆమె తండ్రిని కాపాడి బదులుగా తన కుమారుడిని పెళ్లి చేసుకోవాలని కోరతాడు. తమ కూతురును చెంగయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని హామీ ఇచ్చిన గంగ తండ్రి, పెళ్లయ్యాక కూడా గంగను చదివించాలని కోరతాడు. ఇంట్లో ఆడపిల్లలెవరూ పెద్దగా చదువుకోకూడదని నిషేధం విధించిన చెంగయ్య , సరేనంటూ తల ఊపుతాడు.

నిజానికి పితృ స్వామ్య స్వభావం నరనరాన జీర్ణించుకున్న చెంగయ్య, తన భార్య డాక్టర్ అనే సంగతి కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియనియ్యడు. అలాంటి వాడు తన కోడలిని చదువుకోనిస్తాడా ? తానెవరిని పెళ్లి చేసుకుంటున్నాడో కూడా తెలియని గంగాధరన్‌, మంగళసూత్రం కట్టేటప్పుడు గంగ ముఖం చూస్తాడు. తన దుబాయ్ కలలు కల్లలు కావటానికి కారణమైన గంగను భార్యగా గంగాధరన్‌ అంగీకరించాడా ?

ఒక పెద్ద ఇంటికి కోడలు కావాలనే కల సాకారమైనందుకు సంతోషంగా కొత్త ఇంటికి అడుగు పెట్టిన గంగ, ఒక వైపు తనను అసహ్యించుకునే భర్త, మరోవైపు స్త్రీలను బానిసలుగా భావించే మామగారు.. నడుమ తన కలను సాకారం చేసుకోవటానికి ఎలా పోరాడుతుంది ? ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో అనుక్షణం ఆకట్టుకునే కథనం తో కూడిన మామగారు సీరియల్ ప్రతి రోజూ సోమవారం నుండి శనివారం వరకూ సాయంత్రం 6.30 గంటలకు స్టార్ మా లో ప్ర‌సారం కానుంది.

Ram Charan : రామ్ చరణ్, ఉపాసన ఫారిన్ వెళ్ళింది అందుకేనట..