Mahendra Singh Dhoni: సౌత్ సినిమాలపై కన్నేసిన మహేంద్ర సింగ్ ధోని!

ఇండియన్ స్టార్ క్రికెటర్‌గా మహేంద్ర సింగ్ ధోని ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి గుర్తింపును తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిందే. మూడు రకాల క్రికెట్ ఫార్మాట్‌లలో భారత్‌ను నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లిన ఘనత ధోని సొంతం. అయితే రిటైర్మెంట్ తరువాత ఈ స్టార్ ప్లేయర్, ఇప్పుడు సినిమాలపై కన్నేశాడు.

Mahendra Singh Dhoni: సౌత్ సినిమాలపై కన్నేసిన మహేంద్ర సింగ్ ధోని!

Mahendra Singh Dhoni To Produce South Movies

Updated On : October 13, 2022 / 7:46 PM IST

Mahendra Singh Dhoni: ఇండియన్ స్టార్ క్రికెటర్‌గా మహేంద్ర సింగ్ ధోని ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి గుర్తింపును తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిందే. మూడు రకాల క్రికెట్ ఫార్మాట్‌లలో భారత్‌ను నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లిన ఘనత ధోని సొంతం. అయితే రిటైర్మెంట్ తరువాత ఈ స్టార్ ప్లేయర్, ఇప్పుడు సినిమాలపై కన్నేశాడు.

Mahendra Singh Dhoni : న్యూలుక్ లో ధోని.. సరదాగా స్నేహితులతో కాలక్షేపం

ధోని సినిమాల్లో నటించడం కాకుండా, సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఆయన సొంతంగా ఓ ప్రొడక్షన్ బ్యానర్‌ను స్టార్ట్ చేశారు. ‘ఎం.ఎస్.ధోని ఎంటర్‌టైన్‌మెంట్’ అనే బ్యానర్‌లో ఇప్పటికే మూడు చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. అయితే ఇప్పుడు ధోని సౌత్ సినిమాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. ‘ధోని ఎంటర్‌టైన్‌మెంట్’ అనే ప్రొడక్షన్ హౌజ్‌లో దక్షిణాదిన తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలను ప్రొడ్యూస్ చేసేందుకు ధోని ప్లాన్ చేస్తున్నాడట.

తమిళ్‌లో స్టార్ హీరో విజయ్, తెలుగులో స్టార్ హీరో మహేష్ బాబుల సహాయంతో ధోని ఆయా ఇండస్ట్రీల్లో సినిమాలను ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నాడట. మరి ధోని దక్షిణాదిన ఎలాంటి సినిమాలను ప్రొడ్యూస్ చేస్తాడా.. ధోని బ్యానర్‌లో నటించే హీరోలు ఎవరా అనేది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.