Guntur Kaaram : అమెరికాకు ‘గుంటూరు కారం’ ఘాటు.. మహేష్ సరికొత్త రికార్డ్.. వరుసగా 12వ సినిమా..
మొదటి రోజు గుంటూరు కారం కలెక్షన్స్ భారీగా వస్తాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే మహేష్ ఆల్రెడీ అమెరికాలో కలెక్షన్స్ తో మరో సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు.

Mahesh Babu Creates New Record in America with Guntur Kaaram Collections
Guntur Kaaram : త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా నేడు జనవరి 12న థియేటర్స్ లోకి వచ్చి సందడి చేస్తుంది. రిలీజ్ కి ముందు ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా నేడు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకెళ్తుంది. పండక్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారంటున్నారు అభిమానులు. అమ్మ సెంటిమెంట్ తో మాస్ కమర్షియల్ అంశాలు జోడించి అదరగొట్టారు. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, మురళి శర్మ, ఈశ్వరరావు.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇక సినిమా కలెక్షన్స్ లో కూడా రికార్డ్స్ సెట్ చేయబోతుంది. అర్ధరాత్రి నుంచే ప్రీమియర్స్ వేయడం, థియేటర్స్ లో అభిమానులు సందడి చేస్తుండటంతో మొదటి రోజు గుంటూరు కారం కలెక్షన్స్ భారీగా వస్తాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే మహేష్ ఆల్రెడీ అమెరికాలో కలెక్షన్స్ తో మరో సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు.
మన ఇండియన్ సినిమాలకు, ముఖ్యంగా తెలుగు సినిమాలకు అమెరికాలో మంచి మార్కెట్ ఉంది. అమెరికాలో కూడా మన సినిమాలు గ్రాండ్ గా రిలీజయి మంచి కలెక్షన్స్ సాధిస్తాయి. మన హీరోలు అక్కడ కూడా రికార్డులు సెట్ చేస్తారు కలెక్షన్స్ లో. అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ అంటే మన రూపాయల్లో దాదాపు 8 కోట్లు కలెక్ట్ చేస్తే మంచి కలెక్షన్స్ వచ్చినట్టే. మన హీరోలంతా అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి రికార్డులు సెట్ చేయాలని ఆశపడతారు.
అయితే ఈ రికార్డుని ఇప్పటిదాకా హైయెస్ట్ అందరికంటే ఎక్కువ సార్లు మహేష్ బాబు సాధించాడు. మహేష్ బాబు ఇప్పటికే 11 సినిమాలతో వరుసగా 1 మిలియన్ డాలర్స్, అంతకు పైగా కలెక్ట్ చేసి టాప్ లో ఉండగా తాజాగా గుంటూరు కారం సినిమాతో 12వ సారి ఆ రికార్డ్ సాధించాడు. గుంటూరు కారం సినిమాతో అమెరికాలో ప్రీమియర్స్, మొదటి రోజు హాఫ్ డే లోపే 1.4 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించి మహేష్ మరోసారి తన సత్తా చాటాడు. దీంతో వరుసగా 12వ సారి 1 మిలియన్ డాలర్స్ పైగా కొల్లగొట్టి మహేష్ అమెరికాకు గుంటూరు కారం ఘాటు చూపించాడు.
ఈ రికార్డులో మహేష్ 12 సినిమాలతో మొదటి ప్లేస్ లో ఉండగా నాని 9 సినిమాలతో రెండో ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్ వరుస స్థానాల్లో ఉన్నారు. దీంతో మహేష్ అభిమానులు మరో సరికొత్త రికార్డ్ ఏకంగా అమెరికాలో సెట్ చేసాం అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
In charge and owning it! ?
Superstar @urstrulyMahesh leads the way with absolute flair ?
$1.4 Million+ USA premieres gross ???
Career Biggest Openings for SSMB ❤️#GunturKaaram #BlockBusterGunturKaaram #Trivikram @HaarikaHassine @Vamsi84 @MokshaMovies @PharsFilm pic.twitter.com/rXxG6TTMVG
— Prathyangira Cinemas (@PrathyangiraUS) January 12, 2024