Sitara Ghattamaneni : దీపికా పాటకు మహేష్ కూతురు సితార అదిరే స్టెప్పులు.. వీడియో వైరల్!
ఇటీవల డాన్స్ వీడియోస్ తో ఆకట్టుకుంటున్న మహేష్ కూతురు సితార.. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోణె పాటకి స్టెప్పులు వేసి అదరగొట్టేసింది.

Mahesh Babu daughter Sitara dance for Deepika Padukone song
Sitara Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కూతురు సితార గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండితెర పై ఎంట్రీ ఇవ్వకముందే మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. సోషల్ మీడియాలో సితారకి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఇక సితార కూడా సోషల్ మీడియా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తన ఫొటోలతో పాటు మహేష్ అండ్ ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్ చేస్తూ మహేష్ అభిమానులను ఖుషి చేస్తుంటుంది. ఇక అప్పడప్పుడు తనలోని డాన్స్ టాలెంట్ ని బయటపెడుతూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని గర్వపడేలా చేస్తుంది.
Adah Sharma : నేను బాగానే ఉన్నాను.. ప్రమాదంలో స్వల్ప గాయాలు.. అదా శర్మ ట్వీట్!
ఇప్పటికే క్లాసికల్ డాన్స్ అండ్ సినిమా పాటలకు డాన్స్ చేసి అదుర్స్ అనిపించుకున్న సితార.. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోణె (Deepika Padukone) పాటకి స్టెప్పులు వేసి అదరగొట్టేసింది. రామ్ లీల సినిమాలోని ‘నగడ్ సంగ్ ఢోల్’ పాటకి సితార వేసిన డాన్స్ అందరి చేత క్లాప్స్ కొట్టేలా చేస్తుంది. సితార వేసిన పాటని అనీ మాస్టర్ కోరియోగ్రఫీ చేసింది. ఇటీవల మహేష్ బాబు అతడు సినిమాలోని ‘పిల్ల గాలి అల్లరి’ సాంగ్ కూడా అదిరిపోయే స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.
Rajamouli – Mahesh Babu : రాజమౌళి సినిమాలో మహేష్ హనుమంతుడి పాత్ర.. అమెజాన్ అడవుల్లో సాహసం!
ఇక మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో SSMB28 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కి కొంచెం బ్రేక్ పడింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. గుంటూరు బ్యాక్ డ్రాప్ తో ఫ్యామిలీ కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
View this post on Instagram