Sitara : క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన మహేష్ గారాలపట్టి.. సితార ఇన్‌స్టా రీల్ వైరల్..

పండుగల సమయంలో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన పిక్స్ ని షేర్ చేసే సితార.. తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేసింది.

Sitara : క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన మహేష్ గారాలపట్టి.. సితార ఇన్‌స్టా రీల్ వైరల్..

Mahesh Babu Daughter Sitara Ghattamaneni Christmas celebrations video

Updated On : December 6, 2023 / 11:12 AM IST

Sitara Ghattamaneni : ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల వారసులు కంటే సూపర్ స్టార్ మహేష్ బాబు వారసురాలు సితార.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ తన ఫోటోలు, పలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ వస్తున్నారు. ప్రస్తుతం సితార ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య 1.6 మిలియన్ వరకు చేరింది.

ఇక పండుగల సమయంలో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన పిక్స్ ని షేర్ చేసే సితార.. తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేసింది. క్రిస్మస్ సందర్బంగా సితార కోసం మహేష్ బాబు ఇంటిలో క్రిస్టమస్ ట్రీని ఏర్పాటు చేశారు. ఇక ఆ క్రిస్మస్ ట్రీ ముందు సితార శాంటా క్లాస్ క్యాప్ పెట్టుకొని క్రిస్మస్ పాటకి రీల్ చేసింది. ఈ రీల్ ని తన ఇన్‌స్టాలో షేర్ చేయగానే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి సితార క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని మీరుకూడా చూసేయండి.

Also read : Savitri : మహానటి సావిత్రి బర్త్ డే స్పెషల్.. చిన్న సంతకంతో జెమినీ గణేశన్‌తో పెళ్లి బయటపడిందట..

 

View this post on Instagram

 

A post shared by sitara ? (@sitaraghattamaneni)

మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహేష్, శ్రీలీల పై ఓ డ్యూయెట్ సాంగ్ చిత్రీకరించేందుకు మూవీ టీం కేరళ వెళ్ళడానికి సిద్దమైందట. అలాగే సెకండ్ సింగల్ ని కూడా రిలీజ్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాలో మొత్తం నాలుగు సాంగ్స్ ఉన్నట్లు నిర్మాత నాగవంశీ తెలియజేశారు. మొదటి సాంగ్ ‘దమ్ మసాలా’ దుమ్ము రేపింది. మిగిలిన మూడు సాంగ్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.