మహేష్ కి శత్రువుగా జగపతిబాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు, జగపతిబాబు కాంబోలో వచ్చిన శ్రీమంతుడు సినిమా బాక్సాపీస్ వద్ద ఏ స్థాయిలో నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు మరోసారి మహేష్, జగపతి బాబు కలిసి తెరపై సందడి చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అనిల్-మహేశ్ ప్రాజెక్టులో జగ్గూభాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి.
Also Read : బాబోయ్ దెయ్యం : శ్రీకాకుళంలో భయం భయం
శ్రీమంతుడు చిత్రంలో మహేష్కు తండ్రిగా నటించిన జగపతిబాబు. ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించనున్నారట. శ్రీమంతుడు సినిమాలో మంచి తండ్రీ, కొడుకులుగా నటించిన వారిని అనిల్ రావిపూడి ఇప్పుడు భద్ర శతృవులుగా మార్చేస్తున్నాడు. దిల్‌రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : విల్ స్మిత్ జెమిని మ్యాన్ – ట్రైలర్