కొడుకుతో టెన్నిస్ ఆడుతున్న సూపర్ స్టార్..

  • Published By: Mahesh ,Published On : April 27, 2020 / 11:59 AM IST
కొడుకుతో టెన్నిస్ ఆడుతున్న సూపర్ స్టార్..

Updated On : April 27, 2020 / 11:59 AM IST

కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఇళ్లకే పరిమితమైన సినీ నటులు అనుకోకుండా దొరికిన ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. చేయాలనుకుని చేయలేనివి, ఇష్టమైనవి.. ఇలా చాలా పనులు చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, తనకు సినిమా షూటింగ్స్ లేని సమయంలో ఎక్కువగా ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంటానని గతంలో పలుమార్లు చెప్పడం జరిగింది. ఇక తనకు ఏ మాత్రం ఖాళీ దొరికినా కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు మహేష్. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించడంతో షూటింగ్స్ అన్నీ బంద్ అయిన కారణంగా, కొద్దిరోజులుగా ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి గడుపుతున్నాడు.

తాజాగా గౌతమ్‌తో కలిసి హ్యాపీ‌గా, జాలిగా టెన్నిస్ ఆడుతున్న వీడియో మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేశాడు మహేష్. ఇక ప్రస్తుతం ఈ వీడియో పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. ఒకరకంగా ఈ లాక్‌డౌన్ వలన పిల్లలతో మహేష్ క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నారని, వారితో మా అనుబంధం మరింత పెరిగిందని ఇటీవల ఆయన సతీమణి నమ్రత తెలిపారు.