Kalavathi-Arabic Kuthu: మహేష్ 50 మిలియన్.. విజయ్ 100 మిలియన్ వ్యూస్!
టాలీవుడ్ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు.. కోలీవుడ్ నుండి దళపతి విజయ్ సోషల్ మీడియాను దున్నేస్తున్నారు. కళావతీ అంటూ మహేష్ మెలోడీతో మాయ చేస్తుంటే.. అరబిక్ కుతూతో విజయ్ దుమ్మరేపుతున్నాడ

Vijay Mahesh
Kalavathi -Arabic Kuthu: టాలీవుడ్ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు.. కోలీవుడ్ నుండి దళపతి విజయ్ సోషల్ మీడియాను దున్నేస్తున్నారు. కళావతీ అంటూ మహేష్ మెలోడీతో మాయ చేస్తుంటే.. అరబిక్ కుతూతో విజయ్ దుమ్మరేపుతున్నాడు. మహేష్-విజయ్ ఇద్దరూ మాస్ ఫాన్ బేసున్న హీరోలు కాగా.. ఇద్దరి మధ్యా ఫ్రెండిషిప్పే ఉంది. ఆ ఇద్దరూ సౌత్ ఇండియన్ స్టార్ లయినప్పటికీ ఒకరేమో కోలీవుడ్, మరొకరేమో టాలీవుడ్.
Kalavathi Song: కళావతి పాటికి స్టెప్పులేసిన కీర్తి.. వీడియో వైరల్!
ఒకరకంగా ఈ హీరోల అభిమానులు పోటీలు పడీమరీ ఇద్దరు హీరోల సినిమా పాటలు ట్రెండింగ్ లో కి తెచ్చి, రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. సర్కారు వారి పాట నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కళావతి.. మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవబోతూ యూట్యూబ్ లో 50 మిలియన్ల రికార్డు వ్యూస్ దక్కించుకోగా.. మహేష్ బాబు, కీర్తి సురేష్‌ల మీద ఈ ఈ రొమాంటిక్ పాట మహేష్ అభిమానులనే కాకుండా మెలోడీ మ్యూజిక్ ఇష్టపడే అందరూ రిపీట్ మోడ్ లో ప్లే చేస్తున్నారు.
Arabic Kuthu: విజయ్ బీస్ట్ పాటకి ఎన్టీఆర్ ‘లవ్ దెబ్బ’ మాస్ స్టెప్పులేస్తే?!
ఇక విజయ్ అరబిక్ కూతు ప్యాన్ వరల్డ్ సాంగ్ గా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. జస్ట్ 48 గంటల్లోనే గ్లోబల్ టాప్ సాంగ్స్ లిస్ట్ లో ప్లేస్ దక్కించుకున్న ఈ పాట ఏకంగా 100 మిలియన్ వ్యూస్ దక్కించుకొని టాప్ ప్లేస్ లో నిలిచింది. షరా మామూలుగా వ్యూస్, లైక్స్ రికార్డ్స్ తో.. హలమితి హబిబో.. ఓ వైపు దుమ్ము రేపుతుంటే.. మరోవైపు ఆడియెన్స్ నుంచి సెలెబ్రిటీస్ వరకు ఈ ట్యూన్ రీల్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. కోలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచంద్రన్ కంపోజ్ చేసిన ఈ పాటకు హీరో శివకార్తికేయన్ లిరిక్స్ అందించడం ఓ స్పెషాలిటీ.
https://twitter.com/saregamasouth/status/1497760900136288265
Celebrating #HalamithiHabibo’s sensational records 🔥@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @Siva_Kartikeyan @hegdepooja @jonitamusic @manojdft @AlwaysJani @Nirmalcuts #Beast #ArabicKuthu #BeastFirstSingle pic.twitter.com/yn6VqpjA1J
— Sun Pictures (@sunpictures) February 26, 2022