Kalavathi Song: కళావతి పాటికి స్టెప్పులేసిన కీర్తి.. వీడియో వైరల్!

మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా వస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట. ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఎక్కడ

Kalavathi Song: కళావతి పాటికి స్టెప్పులేసిన కీర్తి.. వీడియో వైరల్!

Kalavathi Song

Updated On : February 21, 2022 / 3:29 PM IST

Kalavathi Song: మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా వస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట. ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఎక్కడ చూసినా కళావతి పాటే మార్మ్రోగిపోయింది. వాలంటైన్ డే కానుకగా రిలీజ్ చేసిన ఈ పాత యూట్యూబ్ లో సంచనల వ్యూస్ దక్కించుకోగా.. సెలబ్రిటీల నుండి సామాన్య ప్రేక్షకుల వరకు ఈ పాటకి షార్ట్స్ చేసి సోషల్ మీడియాలో పెడుతుంటే.. మీమ్స్ కూడా తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Kalavathi Lyrical Song: కళ్లా అవి కళావతి.. కల్లోలమైందే నా గతి..! ఒరిజినల్ పాట విడుదల

వాళ్ళు వీళ్ళు ఈ పాటకి డాన్స్ చేస్తే పెద్దగా వింతేమి లేదు. కానీ కళావతి పాటకి నిజంగా కళావతే డాన్స్ చేస్తే ఎలాగుంటుంది. కీర్తినే ఈ పాటకి డాన్స్ చేసింది. ఈ వీడియో కీర్తి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట సినిమా సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Sarkaru Vaari Paata: ఇక ఆగడు.. ప్రమోషన్ల స్పీడ్ పెంచిన మహేశ్!

ప్రస్తుతం ప్రేక్షకులలో హైప్ పెంచే పనిలో పడిన యూనిట్.. అందులో భాగంగానే ఒక్కో పాటని విడుదల చేస్తూ ప్రమోషన్లు చేపడుతున్నారు. ఇప్పటికే బయటకొచ్చిన ఫస్ట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ కాగా.. ఇప్పుడు మహేష్ అభిమానులు మిగతా పాటల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ పాటలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)