Mahesh Babu getting emotional at Guntur Kaaram pre release event about Krishna demise
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. మరో మూడు రోజుల్లో జనవరి 12న ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. నేడు గుంటూరులో ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ అంతా హాజరయ్యి అభిమానులను ఉత్సాహపరిచారు. ఇక ఈ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
ఈ సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలోనే మహేష్ తండ్రి, రియల్ సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. తండ్రి మరణంతో మహేష్ చాలా రోజులు షూటింగ్ కి దూరంగా ఉన్నారు. కృష్ణ మరణాన్ని మహేష్ తట్టుకోలేకపోయారు. మహేష్ లోని ఆ బాధ నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కనిపించింది.
Also read : Salaar : బ్రేక్ ఈవెన్ సాదించేసిన సలార్.. ఆ రికార్డు సాధించిన ఏకైక సౌత్ హీరో ప్రభాస్..
స్టేజి పై మహేష్ మాట్లాడుతూ..
“సంక్రాంతి నాకు, నాన్న గారికి బాగా కలిసొచ్చింది. ఆ సమయంలో రిలీజ్ అయిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈసారి కూడా బాగా గట్టిగానే కొడతాము. కానీ ఈసారి కొంచెం కొత్తగా ఉంది. ఎందుకంటే ప్రతిసారి సినిమా రిలీజ్ అయినప్పుడు.. ఆ మూవీ కలెక్షన్స్ అండ్ రికార్డులు గురించి నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే చాలా సంతోషం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ప్రతిసారి వెయిట్ చేసేవాడిని.
ఎందుకంటే ఆయన మాటలు కోసమే కదా సినిమాల్లో ఇంత కష్టపడేది. కానీ ఇప్పటినుంచి అవన్నీ చెప్పడానికి ఇప్పుడు ఆయన లేరు. ఇప్పటినుంచి ఆ విషయాలన్నీ మీరే చెప్పాలి. ఇకనుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని. మీ అశీసులు ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే “పాతికేళ్లుగా తనపై చూపిస్తున్న ప్రేమకు అభిమానులకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏం చేయలేను” అంటూ దండం పెట్టి ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.