Salaar : బ్రేక్ ఈవెన్ సాదించేసిన సలార్.. ఆ రికార్డు సాధించిన ఏకైక సౌత్ హీరో ప్రభాస్..

ప్రభాస్ 'సలార్' బ్రేక్ ఈవెన్ సాధించేసింది. అలాగే ఆ రికార్డు సాధించిన ఏకైక సౌత్ హీరోగా ప్రభాస్ నిలిచారు.

Salaar : బ్రేక్ ఈవెన్ సాదించేసిన సలార్.. ఆ రికార్డు సాధించిన ఏకైక సౌత్ హీరో ప్రభాస్..

Prabhas Salaar Part 1 Ceasefire cross break even collections

Updated On : January 9, 2024 / 8:06 PM IST

Salaar : ప్రభాస్ అభిమానులను చాలా ఏళ్ళ తరువాత కాలర్ ఎగరేసేలా చేసిన సినిమా ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో రెండు భాగాలుగా రూపొందించిన ఈ మూవీ పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రభాస్ నుంచి రెబల్ అభిమానులు కోరుకునే మాస్ యాక్షన్ ఈ మూవీలో కనిపించడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిసింది.

మొదటి రోజే ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఏకంగా 178.7 కోట్ల గ్రాస్ ని అందుకొని సంచలనం సృష్టించింది. ఇక మొదటి వీకెండ్ పూర్తి చేసుకునేప్పటికీ 402 కోట్ల గ్రాస్ ని రాబట్టి మరో రికార్డుని క్రియేట్ చేసింది. అలాగే మొదటి వారం రూ.550 కోట్లు, సెకండ్ వీక్ దాదాపు 660 కోట్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం 700 కోట్ల మార్క్ ని దాటేసినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ తెలియజేశారు.

Also read : Sankranti Movies : సంక్రాంతి సినిమాల వివాదం.. మీడియా వారిని హెచ్చరిస్తూ.. ఫిల్మ్ ఛాంబర్ ప్రకటన..

నిన్నటితో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 694.32 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టగా, ఈరోజు కలెక్షన్స్ తో 700 కోట్ల మార్క్ ని క్రాస్ చేసినట్లు పేర్కొన్నారు. కాగా ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 347 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, సుమారు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. నేడు ఆ మార్క్ క్రాస్ చేయడంతో సలార్ బ్రేక్ ఈవెంట్ పూర్తి అయ్యిపోయింది.

ఇక ఈ కలెక్షన్స్ తో ప్రభాస్ మరో రికార్డుని క్రియేట్ చేశారు. 700 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన సినిమాలు ప్రభాస్ కి రెండు ఉన్నాయి. గతంలో బాహుబలి 2, ఇప్పుడు సలార్.. ఈ మార్క్ ని క్రాస్ చేశాయి. కాగా సౌత్ హీరోల్లో 700 కోట్ల మార్క్ ని రెండుసార్లు అందుకున్న ఏకైక హీరో ప్రభాస్. దీంతో రెబల్ అభిమానులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. కాగా మరో మూడు రోజుల్లో సంక్రాంతి సినిమాల సందడి మొదలు కాబోతుంది. మరి ఈ చిత్రం ఆ సినిమాలతో పాటు కలెక్షన్స్ రాబడుతుందా..? లేక ఇక సైడ్ అవుతుందా..? అనేది చూడాలి.