Guntur Kaaram : కనీసం టీజర్, ట్రైలర్ కూడా రాలేదు.. అప్పుడే అమెరికాలో కలెక్షన్స్ బద్దలు కొట్టేస్తున్న ‘గుంటూరు కారం’
మహేష్ గుంటూరు కారం సినిమాతో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే సరికొత్త రికార్డ్ సెట్ చేస్తున్నాడు.

Mahesh Babu Guntur Kaaram Movie Record Collections with Online Bookings in America
Guntur Kaaram : త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం(Guntur Kaaram). ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడి, పలు అడ్డంకులు తట్టుకొని ఈ సంక్రాంతికి జనవరి 12న వస్తుంది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్, మూడు పాటలు కూడా రిలీజ్ చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
సినిమా రిలీజ్ కి ఇంకా అయిదు రోజులే ఉన్నా ఇప్పటివరకు టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయలేదు. పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ చేయలేదు. అయినా సినిమాకు కావాల్సిన హైప్ ఆల్రెడీ వచ్చేసింది. మనకు ఇక్కడ బుకింగ్స్ ఇంకా ఓపెన్ చేయకపోయినా అమెరికాలో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అమెరికాలో ప్రస్తుతం మన తెలుగు సినిమాలకు భారీ మార్కెట్, క్రేజ్ ఉంది. ఇక మహేష్ సినిమాలకు అయితే మరీ ఎక్కువ. ఏ హీరోకి లేని రికార్డ్ మహేష్ బాబుకి అమెరికాలో ఉంది.
అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ కలెక్ట్ చేయడం అంటే ఒక రికార్డ్. ఆ రికార్డుని మహేష్ ఇప్పటివరకు 11 సినిమాలతో సాధించి ఎవ్వరూ అందుకోనంతగా నిలబడ్డాడు. ఇప్పుడు గుంటూరు కారం సినిమాతో 12 సినిమాలు అవుతాయని అర్థమైపోతుంది. గుంటూరు కారం సినిమా అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఇప్పటికే 500K డాలర్స్ ఆన్లైన్ బుకింగ్స్ తో వసూలు అయ్యాయి. అంటే హాఫ్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ అయ్యాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 4 కోట్లకు పైగా కలెక్షన్స్ ఆల్రెడీ వచ్చేశాయి. సినిమా రిలీజ్ కి ఇంకా 5 రోజులు ఉంది కాబట్టి ఈ లోపే 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేస్తుందని అక్కడి బిజినెస్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
దీంతో మహేష్ గుంటూరు కారం సినిమాతో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే సరికొత్త రికార్డ్ సెట్ చేస్తున్నాడు. ఇక గుంటూరు కారం ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.
Take a close look at the poster 🙂
EVERYTHING WILL BE UP BY TUESDAY EOD ?#GUNTURKAARAM @urstrulyMahesh #GunturKaaramPremiersOnJan11 #GunturKaaram https://t.co/Va19T6jkVK
— Prathyangira Cinemas (@PrathyangiraUS) January 6, 2024