Guntur Kaaram : ఏపీలో ‘గుంటూరు కారం’ టికెట్ ధర పెంపుకి అనుమతి.. ఎంత పెరిగిందో తెలుసా..?

ఏపీలో కూడా 'గుంటూరు కారం' టికెట్ ధర పెంపుకి అనుమతి దొరికేసింది. ఎంత పెరిగిందో తెలుసా..?

Mahesh Babu Guntur Kaaram movie ticket price hike in AP details

Guntur Kaaram : సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు పూర్తి మాస్ అవతార్ లో కనిపిస్తూ చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 12న ఆడియన్స్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఓపెనింగ్స్ తోనే రికార్డులు సెట్ చేయడానికి సిద్దమవుతున్న ఈ చిత్రం.. టికెట్ పెంపు కోసం ఎదురు చూస్తుంది.

ఇటీవలే తెలంగాణ గవర్నమెంట్ ఈ చిత్రానికి.. టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు, అలాగే బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి ఇచ్చింది. సింగిల్ స్రీన్స్‌ల‌లో రూ.65, మ‌ల్టీఫెక్స్‌ల‌లో రూ.100 పెంపుకి, రాష్ట్రంలో 23 చోట్ల 12వ తేదీ అర్థ‌రాత్రి 1 గంట షోకు, అలాగే 12 నుంచి 18వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 4 గంట‌ల‌కు షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది. దీంతో ఆంధ్రా ఫ్యాన్స్ అంతా.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూశారు.

Also read : Mahesh Babu : మహేష్ సంక్రాంతి బరిలో ఎన్నిసార్లు హిట్స్ కొట్టాడు..?

తాజాగా ఏపీ గవర్నమెంట్ కూడా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రతి టికెట్ పై రూ.50 పెంచుకునేందుకు వెసులు బాటు కల్పిస్తూ జీవోను జారీ చేసింది. రిలీజ్ తేదీ నుంచి పది రోజుల పాటు పెంచిన ధరలతో గుంటూరు కారం టికెట్స్ విక్రయించబడతాయి. అయితే అదనపు షోలకు సంబంధించి మాత్రం.. ఏపీ ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

ఈ సినిమాలో మహేష్ కి హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంటే మీనాక్షి చౌదరి ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు లు కీలక పాత్రలను పోషించారు. హాసిని, హారిక క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజైన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేస్తోంది. రేపు థియేటర్స్ లో ఈ సాంగ్ కి కుర్చీలు ఇరిగిపోవడం ఖాయంలా కనిపిస్తుంది.