మహర్షి ఫస్ట్ సాంగ్..‘చోటీ చోటీ బాతే’ రిలీజ్

‘మహర్షి’ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్‌బాబు అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సాంగ్‌కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమాను మే 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలోని పాటల కోసం మహేష్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘మహర్షి’ మ్యూజికల్ 2 జర్నీలో తొలి పాటను శుక్రవారం (మార్చి 29, 2019) ఉదయం విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సముద్రం ఒడ్డున ఉన్న ఒక పచ్చటి కొండ అంచున మహేష్.. పూజా.. అల్లరి నరేష్ లు నిలబడి ఉన్నారు. మంచు దుప్పటి కప్పుకున్నట్టున్న క్లైమేట్ లో వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా వేరే వేరే డైరెక్షన్స్ లో సముద్రాన్ని చూస్తూ నిలబడగా వెనక రెండు స్పోర్ట్స్ సైకిల్స్ మాత్రం ఉన్నాయి.
ఇక సాంగ్ గురించి మాట్లాడుకుంటే…‘చోటీ చోటీ బాతే’ అంటూ ఫ్రెండ్‌షిప్ విలువను చెబుతూ సాగిన లిరిక్స్ మహేష్ ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తుంది. తాజాగా విడుదలైన సాంగ్ ని మీరు విని ఎంజాయ్ చేయండి.