Mahesh Babu : బిల్‌గేట్స్ తో మహేష్ మంతనాలు.. వైరల్ గా మారిన ఫొటో

న్యూయార్క్ వెళ్లిన మహేష్ తాజాగా ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ని కలిసాడు. బుధవారం ఉదయం భార్య నమ్రతతో కలిసి బిల్‌గేట్స్ ని కలిసాడు మహేష్ బాబు. బిల్ గేట్స్ తో కలిసి..............

Mahesh Babu : బిల్‌గేట్స్ తో మహేష్ మంతనాలు.. వైరల్ గా మారిన ఫొటో

Mahesh Babu

Updated On : July 1, 2022 / 1:38 PM IST

Bill Gates  :  సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో భారీ విజయం సాధించాడు. ఆ సినిమా విజయం తర్వాత ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్ చెక్కేశాడు మహేష్. ఇటీవల యూరప్ అంతా తిరిగి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ న్యూయార్క్ లో ల్యాండ్ అయ్యాడు.

న్యూయార్క్ వెళ్లిన మహేష్ తాజాగా ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ని కలిసాడు. బుధవారం ఉదయం భార్య నమ్రతతో కలిసి బిల్‌గేట్స్ ని కలిసాడు మహేష్ బాబు. బిల్ గేట్స్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోని షేర్ చేస్తూ.. ”బిల్‌గేట్స్ ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ వ్యక్తుల్లో ఒకరు. మోటివేట్ చేసే వ్యక్తి, ఎంతో గౌరవమైన వ్యక్తిని కలిసినందుకు హ్యాపీగా ఉంది” అంటూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత బిల్‌గేట్స్ తో కొద్దీ సమయం ముచ్చటించారు మహేష్ దంపతులు.

Chiranjeevi : ప్రధాని మోదీతో వేదికని పంచుకోబోతున్న చిరంజీవి

మహేష్ బిల్‌గేట్స్ తో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ అభిమానులు ఈ ఫోటోని మరింత షేర్ చేస్తున్నారు. త్వరలోనే మహేష్ ఇండియాకి తిరిగి వచ్చి త్రివిక్రమ్ సినిమాని మొదలుపెట్టనున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)