మార్పు మన ఇంటి నుండే మొదలవ్వాలి..

  • Published By: sekhar ,Published On : July 28, 2020 / 04:42 PM IST
మార్పు మన ఇంటి నుండే మొదలవ్వాలి..

Updated On : July 28, 2020 / 5:08 PM IST

మార్పు మ‌న‌తోనే మొద‌లు కావాల‌ని అంటున్నారు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు. ఇంత‌కూ మ‌హేష్ చెబుతున్న మార్పు ఏంటో తెలుసా? ప‌్ర‌కృతి గురించి. పర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త గురించి మ‌హేశ్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

‘‘నీటిని సంరక్షించుకోండి. వనరులను పునరుత్పత్తి అయ్యేలా వినియోగించుకోవాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ఈ గ్లోబల్ క్రైసిస్ నుండి మ‌నల్ని మ‌న‌మే ర‌క్షించుకోవాలి. మ‌న ప‌కృతిని కూడా కాపాడాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మార్పు మీ ఇంటి నుండే మొద‌లు పెట్టండి’’.. అన్నారు సూప‌ర్ స్టార్ మ‌హేష్.

అందరం కూడా మ‌హేష్ స‌ల‌హాను ఫాలో అయితే మంచిదే మరి. లాక్‌డౌన్ స‌మ‌యంలో కుటుంబంతో స‌ర‌దాగా గ‌డుపుతున్న మ‌హేష్ సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత ‘స‌ర్కారు వారి పాట‌’ షూటింగ్‌లో పాల్గొంటారు మహేష్ బాబు.