ఫ్రెండ్ ఫంక్షన్‌లో నమ్రతా శిరోద్కర్, ప్రణతి సందడి.. ఫొటోలు వైరల్..

కామన్ ఫ్రెండ్ మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ లో ఇతర ఫ్రెండ్స్ తో కలిసి నమ్రత, ప్రణతి సందడి చేసారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఫ్రెండ్ ఫంక్షన్‌లో నమ్రతా శిరోద్కర్, ప్రణతి సందడి.. ఫొటోలు వైరల్..

Mahesh Babu NTR wives Namrata Shirodkar Lakshmi Pranathi at friends function photos viral

Namrata Shirodkar – Lakshmi Pranathi : ఒకప్పుడు మూవీ స్టార్స్ గురించి తప్ప వారి కుటుంబసభ్యుల గురించి ఆడియన్స్‌కి పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల.. స్టార్స్ ఫ్యామిలీ విషయాలు కూడా ప్రేక్షకుల అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న మహేష్ బాబు, రామ్ చరణ్.. ఫ్యామిలీ మెంబెర్స్ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా కనిపిస్తుంటారు.

మహేష్, చరణ్ కి సంబంధించిన పోస్టులను కూడా షేర్ చేస్తూ నమ్రతా శిరోద్కర్, ఉపాసన అభిమానులను ఖుషి చేస్తుంటారు. ఇక ఇండస్ట్రీలో ఉన్న మరో ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబెర్స్ సోషల్ మీడియాలో నమ్రత, ఉపాసన అంత యాక్టీవ్ గా ఉండరు. బన్నీ సతీమణి స్నేహారెడ్డి అయినా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. కానీ ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి మాత్రం సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు.

Also read : Premalu : తెలుగు ఆడియన్స్‌ని ఫిదా చేస్తున్న తమిళ్, కన్నడ, మలయాళ ప్రేమ కథలు.. ఇప్పుడు ‘ప్రేమలు’ తెలుగు రిలీజ్..

కానీ ఎవరో ఒకరి పోస్టుల్లో కనిపిస్తూ ఉంటారు. ఉపాసన, నమ్రతలతో మంచి స్నేహం ఉన్న ప్రణతి.. అప్పుడప్పుడు వారి ఫొటోల్లో కనిపిస్తూ ఉంటారు. తాజాగా నమ్రత షేర్ చేసిన ఫొటోల్లో ప్రణతి కనిపించారు. వీరిద్దరికి కామన్ ఫ్రెండ్ అయిన ఒక వ్యక్తి 25 ఏళ్ళ మ్యారేజ్ యానివర్సరీ కావడంతో.. ఆ ఫంక్షన్ లో ఇతర ఫ్రెండ్స్ తో కలిసి నమ్రత, ప్రణతి సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

ఇక ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాలు విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ‘దేవర’ రెండు పార్టుల షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఆ తరువాత వార్ 2, ప్రశాంత్ నీల్ తో సినిమాలు లైనప్ లో పెట్టి ఉంచారు. ఈ ప్రాజెక్ట్స్ పై పాన్ ఇండియా వైడ్ క్యూరియాసిటీ నెలకుంది. ఇక మహేష్ బాబు ఏమో.. రాజమౌళితో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ‘SSMB29’ని ట్రాక్ ఎక్కించే పనిలో ఉన్నారు. ఈ ఏడాది మేలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని టాక్ వినిపిస్తుంది.