Maama Mascheendra Trailer : సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు..

సుధీర్ బాబు నటిస్తున్న ప్రయోగాత్మక సినిమా ‘మామా మశ్చీంద్రా’ ట్రైలర్ ని మహేష్ బాబు రిలీజ్ చేశాడు.

Maama Mascheendra Trailer : సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు..

Mahesh Babu releases Sudheer Babu Maama Mascheendra Trailer

Updated On : September 27, 2023 / 4:05 PM IST

Maama Mascheendra Trailer : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) తన కథల ఎంపికలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. సినిమాకి సినిమాకి వైవిద్యం చూపిస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ఈ హీరో ‘మామా మశ్చీంద్రా’ అనే ఓ ప్రయోగాత్మక సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఆల్రెడీ ప్రమోషన్స్ మొదలు పెట్టిన మూవీ టీం.. సాంగ్స్, టీజర్, గ్లింప్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

Ram Gopal Varma : ఓ అమ్మాయి కోసం వ‌ర్మ ఆరాటం.. పేరు చెప్పాలంటూ ట్వీట్‌.. వైర‌ల్‌

తాజాగా మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు.. ట్రిపుల్ రోల్‌లో నటిస్తున్నాడు. ఒక పాత్ర ఓల్డ్ గెటప్ లో ఉంటే, మరో పాత్ర యంగ్ అండ్ స్టైలిష్ గా, మూడో పాత్ర లావుగా కనిపిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే.. మామ, మేనల్లుడు మధ్య జరిగే ఒక రివెంజ్ డ్రామా స్టోరీ అని తెలుస్తుంది. మేనల్లుడలకి మేనమామ పోలిక రావడం, ఆ మావయ్య కూతుళ్లు తండ్రి రూపంతో ఉన్న హీరోలతో ప్రేమలో పడడం, ఆ తరువాత ఏం జరిగిందనేది కథ.

2018 Movie : నిన్న ఇంటర్నేషనల్ అవార్డు.. నేడు ఆస్కార్‌కి ఎంపిక..

కాగా ఈ మూవీని టాలీవుడ్ యాక్టర్, రైటర్ హర్షవర్ధన్.. డైరెక్టర్ గా పరిచయం అవుతూ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈషా రెబ్బా, మిర్నాల్ని రవి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా.. అభినయ, హర్ష వర్ధన్, అజయ్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 6న ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు.