మల్టీ స్టారర్ : ఎన్టీఆర్, చరణ్ అయితే ఓకే!
మల్టీ స్టారర్ కథ దొరికితే ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో సినిమా చేస్తా : మహేష్ బాబు..

మల్టీ స్టారర్ కథ దొరికితే ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో సినిమా చేస్తా : మహేష్ బాబు..
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజాహెగ్డే జంటగా, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, వైజయంతీ మూవీస్.. అశ్వినీదత్, శ్రీ వెకటేశ్వర క్రియేషన్స్.. దిల్ రాజు, పివిపి సినిమా.. పెరల్ వి.పొట్లూరి – పరమ్ వి.పొట్లూరి కలిసి నిర్మించిన మహేష్ 25వ సినిమా, మహర్షి మరికొద్ది రోజుల్లో సిల్వర్ స్ర్కీన్స్‌పై సందడి చెయ్యబోతుంది. ఈ సందర్భంగా మహర్షి టీమ్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతుంది. రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వూలో మహేష్ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు.
రాజమౌళితో సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని చెప్పిన మహేష్.. మల్టీస్టారర్ గురించి పాత్రికేయులు అడిగ్గా.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత నా దగ్గరకి మల్టీ స్టారర్ కథలేవీ రాలేదు.. ఒకవేళ వస్తే తప్పకుండా చేస్తాను.. అని చెప్పాడు. ఏ హీరోతో అయితే మల్టీ స్టారర్ చేస్తారు అని అడిగితే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో చెయ్యడానికి ఇష్టపడతాను అని చెప్పాడు. మహర్షి మే 9న రిలీజవుతున్న సంగతి తెలిసిందే.