Guntur Kaaram : న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కి మహేష్, శ్రీలీల మాస్ సాంగ్.. బాబు ఫ్యాన్స్‌ రచ్చకి సిద్దంకండి..

'గుంటూరు కారం'లో ఈ మాస్ సాంగ్ ఓ రేంజ్ ఉంటదంట. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో బాబు ఫ్యాన్స్‌కి ఊపే.

Guntur Kaaram : న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కి మహేష్, శ్రీలీల మాస్ సాంగ్.. బాబు ఫ్యాన్స్‌ రచ్చకి సిద్దంకండి..

Mahesh Babu Sreeleela mass song from Guntur Kaaram is ready to released on New year time

Updated On : December 26, 2023 / 5:54 PM IST

Guntur Kaaram : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడోసారి నటిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈసారి పక్కా మాస్ మసాలా మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మహేష్ కి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే మరోపక్క ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టారు.

ఈక్రమంలోనే ఇప్పటికే మూవీ నుంచి రెండు సాంగ్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. మొదటి సాంగ్‌ని మాస్ బీట్ తో రెడీ చేసిన మూవీ టీం.. సెకండ్ సాంగ్ లవ్ బీట్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇప్పుడు మూడో సాంగ్ ని మరో మాస్ బీట్ తో సిద్ధం చేశారట. ఈ పాటకి మహేష్ బాబు, శ్రీలీల కలిసి చేసే డాన్స్.. థియేటర్ లో విజిల్స్ వేయిస్తుందట. శ్రీలీల మాస్ డాన్స్ గురించి చెప్పనవసరం లేదు. దానికి మహేష్ స్టైల్ తోడైతే కన్నులు పండగే.

Also read : Allu Ayaan – Arha : క్రిస్మస్ కేక్ రెడీ చేసిన అల్లు అయాన్, అర్హ.. వీడియో చూశారా..?

కాగా ఈ సాంగ్ కి సంబంధించిన ఓ వీడియో షూటింగ్ సెట్స్ నుంచి లీక్ అయ్యింది. ఆ వీడియోలో మహేష్, శ్రీలీల వేసిన ఓ చిన్న స్టెప్పు.. ఫ్యాన్స్ లో ఆ పాట పై భారీ అంచనాలు కలిగేలా చేసింది. కాగా ఈ పాటని న్యూ ఇయర్ వేడుకల్లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారట. దీంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి బాబు ఫ్యాన్స్ మంచి స్టఫ్ దొరికినట్లు అయ్యింది. ఇక ఈ ఇయర్ ని మహేష్ మాస్ సాంగ్ తో రచ్చ రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్నారు ఫ్యాన్స్.

ఈ సినిమాలో మొత్తం 4 పాటలు, ఒక బిట్ సాంగ్ ఉన్నాయట. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతికి చాలా రిలీజ్ లు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వీటిలో కొన్ని పోస్టుపోన్ చేయాలని నిర్మాత మండలిలో చర్చ జరిగింది. అయితే గుంటూరు కారం మొదటి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో దానిని పోస్టుపోన్ చేసే సమస్య లేదని దిల్ రాజు తెలియజేశారు.