Mahesh Babu : మహేష్ బాబు ఇకపై యాడ్స్ చేయడా? ఆ సినిమా కోసమే ఈ డెసిషన్..?

మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టారు. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని తెలిసిందే.

Mahesh Babu : మహేష్ బాబు ఇకపై యాడ్స్ చేయడా? ఆ సినిమా కోసమే ఈ డెసిషన్..?

Mahesh Babu Stop Doing Ads also until Complete SSMB 29 Movie Rumours goes Viral

Updated On : March 14, 2024 / 7:27 AM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టారు. త్వరలో రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని తెలిసిందే. మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులంతా మహేష్ – రాజమౌళి సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు పెంచుకుంటున్నారు. రాజమౌళి ఈ సినిమాని భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది, పాటల వర్క్ కూడా మొదలైందని ఇటీవల విజయేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

రాజమౌళితో సినిమా అంటే కనీసం మూడు సంవత్సరాలు ఈజీగా పడుతుంది. మహేష్ సినిమాని భారీగా పాన్ వరల్డ్ ప్లాన్ చేస్తుండటంతో ఇంకా ఎక్కువ సమయమే పట్టొచ్చు అని తెలుస్తుంది. దీంతో అప్పటిదాకా మహేష్ ని థియేటర్స్ లో, బయట ప్రమోషన్స్ లో కూడా ఆచూడటం కష్టమే. అయితే మహేష్ రెగ్యులర్ గా యాడ్స్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త యాడ్స్ తో పలకరిస్తారు. కానీ రాజమౌళి సినిమా అయ్యేదాకా యాడ్స్ కూడా చేయడని సమాచారం.

Also Read : Vishwak Sen : సెల్ఫీలు తీసుకుంటున్న ఫ్యాన్స్.. ఫోన్లు లాగేసుకున్న విశ్వక్ సేన్.. వీడియో వైరల్

రాజమౌళి సినిమా చేసేటప్పుడు హీరోలు మధ్యలో ఏ సినిమా షూట్ లోను, వేరే వర్క్ లోను పాల్గొనరు. రాజమౌళి సినిమా మీదే ఫోకస్ ఉండాలని, మూవీ షూట్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు మహేష్ బాబు యాడ్స్ కూడా చేయొద్దని, షూట్ అయ్యేలోపే ఎన్ని యాడ్స్ వస్తే అన్ని చేసేయాలని ఫిక్స్ అయినట్టు టాలీవుడ్ సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా రాజమౌళి సినిమా కాబట్టి ఇది కచ్చితంగా జరుగుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి మహేష్ – రాజమౌళి అడ్వెంచరస్ మూవీ ఏ రేంజ్ లో తీస్తారో చూడాలి.