Mahesh Babu : మహేష్, మిల్కీబ్యూటీ జంటగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో..

సూపర్ స్టార్ మహేష్ బాబు, మిల్కీ బ్యూటీ తమన్నా ‘ఆగడు’ తర్వాత మరోసారి జంటగా నటిస్తున్నారు.. ‘అర్జున్ రెడ్డి’ తో టాలీవుడ్‌లో, ‘కబీర్ సింగ్’ తో బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫిలిం షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

Mahesh Babu : మహేష్, మిల్కీబ్యూటీ జంటగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో..

Mahesh Babu

Updated On : March 16, 2021 / 1:49 PM IST

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, మిల్కీ బ్యూటీ తమన్నా ‘ఆగడు’ తర్వాత మరోసారి జంటగా నటిస్తున్నారు.. ‘అర్జున్ రెడ్డి’ తో టాలీవుడ్‌లో, ‘కబీర్ సింగ్’ తో బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫిలిం షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

Mahesh - Tamannaah

అయితే ఇది ఫీచర్ ఫిలిం కాదు యాడ్ ఫిలిం.. మహేష్ పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. రీసెంట్‌గా మహేష్ ఖాతాలో మరో కొత్త బ్రాండ్ వచ్చి చేరింది. పాపులర్ హోమ్ అప్లయెన్సెస్ సంస్థ హావెల్స్‌ (Havells) కు మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.

ఇందులో భాగంగా మహేష్, తమన్నాలపై సందీప్ డైరెక్షన్‌లో యాడ్ షూటింగ్ చేస్తున్నారు. మంగళవారం తమన్నాతో కలిసి మహేష్ షూటింగ్‌లో పాల్గొన్నారు. మహేష్ ‘సర్కారు వారి పాట’, తమన్నా ‘ఎఫ్ 3’, సందీప్ హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమాలతో బిజీగా ఉన్నారు.